Movies25 ఏళ్ల రష్మిక అంటే బాలయ్యకు ఎందుకు అంత ఇష్టమో తెలుసా..అసలు...

25 ఏళ్ల రష్మిక అంటే బాలయ్యకు ఎందుకు అంత ఇష్టమో తెలుసా..అసలు సీక్రేట్ ఇదే..!!

ప్రజెంట్ సోషల్ మీడియాలో నందమూరి బాలకృష్ణ నేషనల్ క్రష్ రష్మిక మందన్నా పేర్లు మారుమ్రోగిపోతున్నాయి. దానికి కారణం బాలయ్య ను తన క్రష్ ఎవరు అనగానే రష్మిక మందన పేరు చెప్పడం. మనకు తెలిసిందే బాలయ్య హోస్ట్ గా చేస్తున్న అన్ స్టాపబుల్ షో సీజన్ 2 గత వారమే ప్రారంభమైంది . ఫస్ట్ ఎపిసోడ్లో భాగంగా చంద్రబాబు నాయుడు , నారా లోకేష్ వచ్చి సందడి చేసారు. . ఇక సెకండ్ ఎపిసోడ్లో టాలీవుడ్ యంగ్ హీరోస్ విశ్వక్ సేన్.. సిద్దు జొన్నలగడ్డ అన్ స్టాపబుల్ షో కి వచ్చి బాలయ్యతో సరదాగా అల్లరి చేసారు. దీనికి సంబంధించిన ప్రోమోను ఆహా వాళ్లు అఫీషియల్ గా రిలీజ్ చేశారు.

కాగా ఈ షోలో ఇద్దరు యంగ్ హిరోస్ తో పోటీపడుతూ బాలయ్య చేసిన డాన్స్ అందరిని ఆకట్టుకుంది. అంతేకాదు ఏమాత్రం తీసిపోని విధంగా బాలయ్య వేసిన పంచెస్ చెప్పిన డైలాగ్స్ నందమూరి అభిమానులను బాగా ఆకట్టుకుంటున్నాయి. ఈ క్రమంలోనే షోలో భాగంగా వాళ్ళు బాలయ్యను ..”మీ ప్రజెంట్ క్రష్ ఎవ్వరు అని అడగక ఆయన రష్మిక మందన్నా” అంటూ చెప్పుకొచ్చారు . దీంతో ఒక్కసారిగా అక్కడ ఉన్న జనాలు చప్పట్లు కొట్టారు. దీంతో ప్రజెంట్ దీంతో సోషల్ మీడియాలో రష్మిక మందన్నా-బాలకృష్ణ పేర్లు వైరల్ గా మారాయి.

కాగా ఇంతమంది హీరోయిన్స్ ఉండగా బాలయ్య ఎందుకు రష్మిక మందన్నా పేరే చెప్పాడు అని కొందరు చర్చించుకుంటున్నారు. దానికి మెయిన్ రీజన్ రష్మిక మందన్నా మంచితనం అంటూ తెలుస్తుంది. మనకు తెలిసిందే రష్మిక మందన్నా సినీ ఇండస్ట్రీ లోకి వచ్చిన అతి తక్కువ టైంలోనే స్టార్ హీరోయిన్ లిస్టులోకి యాడ్ అయింది . అయితే అంతకుమించిన గొప్ప మనసు ఆమెకి ఉంది . రష్మిక మందన ప్రతి సినిమాకు వచ్చే రెమ్యూనరేషన్ లో కొంత భాగాన్ని అనాధ పిల్లలకి చారిటబుల్ ట్రస్ట్ కి డొనేట్ చేస్తుందట . అంతేకాదు గతంలో ఓసారి బాలకృష్ణ గారికి సంబంధించిన బసవతారకమ్మ క్యాన్సర్ హాస్పిటల్ కి కూడా రష్మిక తన స్దాయి సహాయం చేసినట్లు తెలుస్తుంది.

అంతేకాకుండా అనాధ పిల్లల్ని చేరదీసి రష్మిక హెల్ప్ చేస్తుంది . ఈ క్రమంలోని రష్మిక గురించి తెలుసుకున్న బాలయ్య ఇండస్ట్రీలో ఇలాంటి హీరోయిన్స్ నే ఉండాలని ..రష్మిక మందన లాంటి మంచి మనసు అందరికీ ఉండదని ..గతంలో సీజన్ వన్ కి వచ్చినప్పుడు ఆమెతోనే చెప్పారట . కోపం వస్తే అరిచే బాలయ్య..మంచి పని చేస్తే గుండెల్లో పెట్టుకుంటారు అని చెప్పడానికి ఈ ఒక్క మాట చాలు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news