Moviesహ్యూజ్ హిట్ కి కారణం అదే.. టాప్ సీక్రెట్ ను బయట...

హ్యూజ్ హిట్ కి కారణం అదే.. టాప్ సీక్రెట్ ను బయట పెట్టేసిన కాంతారా బ్యూటీ ..కన్నడ ఇండస్ట్రీ షాక్..!!

ప్రజెంట్ ఎక్కడ చూసినా ఒకటే పేరు మారుమ్రోగిపోతుంది . అదే రిషబ్ శెట్టి నటించిన “కాంతారా”. ఎటువంటి అంచనాలు లేకుండా సదాసీదాగా రిలీజ్ అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ రికార్డులను కొల్లగొడుతుంది . ఇప్పటివరకు హైయెస్ట్ ఐఎండిబి రేటింగ్ సంపాదించుకున్న ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ 2 రికార్డును కొల్లగొడుతూ.. ఏకంగా కాంతారావు మూవీ 9.5 రేటింగ్ తో టాప్ ప్లేస్ లో ఉంది. దీంతో ఒక్కసారి అందరి దృష్టి కాంతారా సినిమా పైనే పడింది

రిషిప్ శెట్టి నటించిన కాంతారా సినిమా కన్నడలో రిలీజ్ అయ్యి రికార్డ్ స్థాయి వసూళ్లు సాధిస్తుంది. బాక్స్ ఆఫీస్ దగ్గర అసాధారణమైన విజయాన్ని అందుకుంటున్న కాంతారా సినిమా త్వరలోనే 200కోట్ల క్లబ్ లోకి చేరిపోతుంది అంటూ సినీ విశ్లేషకులు భావిస్తున్నారు . ఈ క్రమంలోనే తెలుగులో రిలీజ్ అయిన కాంతారా ..ఇక్కడ కూడా సూపర్ హిట్ టాక్ ను దక్కించుకున్నింది. అంతేకాదు భారీ కలెక్షన్ల దిశగా దూసుకుపోతుంది. ఇది ఇలా ఉండగా ఈ సినిమాలో జోడిగా నటించిన హీరోయిన్ సప్తమి గౌడ పేరు ఈ సినిమా ద్వారా బాగా పాపులారిటీ లోకి వచ్చింది.

అంతకముందు సప్తమి కొన్ని సినిమాల్లో నటించినా.. ఆమెకు పెద్దగా గుర్తింపు తీసుకురాలేకపోయింది . కానీ సినిమా ద్వారా ఒక్కసారి ఫామ్ లోకి వచ్చిన సప్తమి క్రేజీ ఆఫర్స్ ను పట్టేస్తుంది . కాగా ఈ సినిమా కోసం సప్తమి చేసిన పని ఇప్పుడు ఇంటర్నెట్లో వైరల్ గా మారింది. ఈ సినిమాలో న్యాచురల్ లుక్స్ లో అదరగొట్టిన సప్తమి కాంతారా సినిమా కోసం రెండు వైపులా ముక్కు కుట్టించుకున్నిందట. అంతేకాదు ఈ సినిమా కోసం అందరం చాలా కష్టపడ్డామని,, ప్రతి సీన్ ని చాలా కేర్ ఫుల్ గా గా నేచురాలిటీగా అందరికీ నచ్చే విధంగా తెరకెక్కించాలని ఈ సినిమా కోసం టీం మొత్తం చాలా చాలా కష్టపడ్డామని దానికి తగ్గ ఫలితం అందుకున్నందుకు హ్యాపీగా ఉందని చెప్పుకొచ్చింది . కథలో కంటెంట్ ఉంటే కచ్చితంగా సినిమా హిట్ అవుతుందని జనాలు ఆ సినిమాను ఆదరిస్తారని మరోసారి కాంతారా మూవీ ద్వార ప్రూవ్ అయిందని సప్తమి గౌడ చెప్పుకోరావడం సంచలనంగా మారింది. అంతేకాదు సప్తమి గౌడ ఇప్పటికే మూడు క్రేజీ ప్రాజెక్టులలో సైన్ చేసినట్లు తెలుస్తోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news