Moviesఅప్పుడు ఏం పీకావ్ రా..ఇనయ నోటి దూలకి..శ్రీహాన్ ఘాటు ఆన్సర్..!!

అప్పుడు ఏం పీకావ్ రా..ఇనయ నోటి దూలకి..శ్రీహాన్ ఘాటు ఆన్సర్..!!

బిగ్ బాస్ 6 లో రోజు రోజుకి గొడవలు మరింత ముదిరిపోతున్నాయి. వారాలు గడిచే కొద్ది ..ఫినాలే ఎపిసోడ్ దగ్గర పడేకొద్దీ ..కంటెస్టెంట్లలో ఫైర్ పెరుగుతుంది. బిగ్ బాస్ హౌస్ లో ఉండే కంటెస్టెంట్స్ ఆస్కార్ పెర్ఫార్మన్స్ ఇస్తూ ..ఎవరికి తోచిన విధంగా వారు గేం ఆడుతున్నారు . కాగా సోమవారం నామినేషన్ ప్రక్రియలో భాగంగా హౌస్ లోని టాప్ కంటెస్టెంట్స్ ఇనయ-శ్రీహన్ ల మధ్య జరిగిన గొడవ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

మనకు తెలిసిందే మొదటి నుంచి హౌస్ లో ఇనయ-శ్రీహన్ల మధ్య ఏదో ఒక గొడవ జరుగుతూనే ఉంది. వీటిని క్లోజ్ చేయకుండా వీకెండ్ లో నాగార్జున ఇద్దరి మధ్యలో ఇంకా చిచ్చు పెడుతూ టిఆర్పిలు పెంచుకోవడానికి చూస్తున్నాడు అంటూ జనాలు మండిపడుతున్నారు. ఈ క్రమంలోనే లాస్ట్ ఎపిసోడ్లో నాగార్జున, ఇనయాకు ఘాటుగా కౌంటర్లు వేశాడు. ఆ కోపంతో సోమవారం నామినేషన్లో ఇనయ ఫుల్ ఫై ఫైర్ గా ఉన్నింది. దీనికి తగ్గట్లే శ్రీహన్..ఆమెను నామినేషన్ ప్రక్రియలో భాగంగా నామినేట్ చేసాడు. దీంతో కోపంతో ఊగిపోయిన ఇనయా.. “అసలు నన్ను ఎందుకు నామినేట్ చేస్తున్నావ్ అనగా ..శ్రీహాన్ నామినేట్ చేసినప్పుడు తనని లయర్ అంటూ మాట్లాడిందని ఆరోపించగా.. అది నిజం కాదని నువ్వు కావాలని నన్ను నామినేట్ చేస్తున్నావని విమర్శించింది. అంతేకాదు అప్పుడు ఏం పీకావు నువ్వు అంటూ ఘాటుగా మాట్లాడింది.

దీంతో ఒక్కసారిగా నామినేషన్ ప్రక్రియ వేడెక్కింది . అంతేకాకుండా నీ దగ్గర ఏం పాయింట్లు లేకుండా నన్ను నామినేట్ చేస్తున్నావంటూ మండిపడింది . తనదైన స్టైల్ లో మాట్లాడి కవర్ చేసిన శ్రీహాన్..మళ్లీ ఇనయ వంతు రాగానే నామినేట్ చేసి పగ తీర్చుకుంది . దీంతో మళ్ళీ వాళ్ల మధ్య మాటల యుద్ధం కొనసాగింది. అయితే ఈ వారం ఎప్పుడూ లేనంత విధంగా అత్యధికంగా 13 మంది హౌస్ నుండి బయటకు వెళ్లడానికి నామినేట్ అయ్యారు. వీరిలో రేవంత్, బాలాదిత్య, రోహిత్, వాసంతి, శ్రీహాన్, ఆదిరెడ్డి, అర్జున్ ,కీర్తి, శ్రీ సత్య, మేరీనా, రాజ్ ,ఫైమా లు ఉన్నారు. చూడాలి ఈ వారం హౌస్ నుండి ఎవ్వరు ఎలిమినేట్ అవుతారో..?

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news