Moviesఅప్పుడు చిరంజీవి..ఇప్పుడు బాలయ్య..త్రిష ఇద్దరికి ఒక్కటే కండీషన్..!!

అప్పుడు చిరంజీవి..ఇప్పుడు బాలయ్య..త్రిష ఇద్దరికి ఒక్కటే కండీషన్..!!

ఒకప్పటి స్టార్ హీరోయిన్ త్రిష ..మళ్లీ తన అందచందాలతో కుర్రాలను ఓ ఊపు ఊపేయడానికి సిద్ధపడింది . మనకు తెలిసిందే గత కొంతకాలంగా త్రిష సినీ ఇండస్ట్రీకు దూరంగా ఉంటుంది. దానికి కారణాలు ఏవైనప్పటికీ ఇంత అందాన్ని సినీ జనాలు మర్చిపోలేక పోయారు. దీంతో త్రిష కు దర్శక నిర్మాతలు కొత్త అవకాశాలు ఇచ్చారు. ఈ క్రమంలోని స్టార్ డైరెక్టర్ మణిరత్నం పోనియన్ సెల్వన్ సినిమాలో కుందవై దేవి పాత్రలో కుందనపు బొమ్మల మెరిసిపోయింది త్రిష .

ఈ సినిమా హ్యూజ్ బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో ఒక్కసారిగా త్రిష పేరు మళ్లీ ఫామ్ లోకి వచ్చింది . కాగా కెరియర్ స్టార్టింగ్ లో ఎలాంటి అందంతో త్రిష మెరిసిపోయిందో ..ఇప్పటికీ అలాంటి ఫిజిక్ ని మైంటైన్ చేస్తూ కాంతివంతంగా మెరిసిపోతుంది. ఈ క్రమంలోనే త్రిష నందమూరి హీరో బాలయ్య-అనిల్ రావిపూడి డైరెక్షన్లో తెరకెక్కబోతున్న సినిమాలో హీరోయిన్గా ఛాన్స్ అందుకుంది అంటూ న్యూస్ వైరల్ గా మారింది . ప్రజెంట్ గోపీచంద్ మల్లినేని డైరెక్షన్లో ఓ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న బాలయ్య.. ఈ సినిమా షూట్ కంప్లీట్ అవ్వగానే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో మరో సినిమాలో నటించబోతున్నాడు.


ఈ సినిమాలో ఇప్పటికే బాలకృష్ణ కూతురుగా శ్రీలీల కన్ఫామ్ అయింది. ఈ సినిమాలో హీరోయిన్ గా ఒకప్పటి హీరోయిన్ త్రిష ని అనిల్ రావిపూడి ఫిక్స్ అయ్యారట . అయితే త్రిష ఎవరు ఊహించిన విధంగా కోటి 50 లక్షలు పారితోషకం డిమాండ్ చేసి అనిల్ రావిపూడి కి షాక్ ఇచ్చిందంట. అంతేకాదు గతంలో కూడా త్రిష చిరంజీవి స్టాలిన్ సినిమాకు ఇలాగే చేసింది . ఆ టైంలో తన మార్కెట్ రేంజ్ కు తగ్గట్టు 80 లక్షలు డిమాండ్ చేసి.. రెమ్యూనరేషన్ ను నేను అడిగినంత ఇస్తేనే సినిమా చేస్తాను..అంటూ కండిషన్ పెట్టింది. ఇప్పుడు కూడా అంతే సేమ్ అదే స్ట్రాటజీని ఫాలో అవుతుంది అని తెలుస్తుంది. త్రిష రేంజ్ కి కోటి 50 లక్షలు నిజంగా ఎక్కువ అంటున్నారు జనాలు. మరి చూడాలి అనిల్ రావిపూడి ఏం చేస్తారో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news