Moviesఫస్ట్ టైం టంగ్ స్లిప్ అయిన సుమ..ఇద్దరు హీరోల ఫ్యాన్స్ మధ్య...

ఫస్ట్ టైం టంగ్ స్లిప్ అయిన సుమ..ఇద్దరు హీరోల ఫ్యాన్స్ మధ్య చిచ్చు..అంత మాట ఎలా అన్నింది..!!

స్టార్ యాంకర్ సుమ తన టాలెంట్ తో, తన చలాకితనంతో… తన అల్లరితో.. ఎలాంటి షోస్ నైనా ఎలాంటి ఈవెంట్స్ అయినా కొత్త ఫీలింగ్ కలిగేలా చేస్తుంది. సినీ ఇండస్ట్రీలో ఎంతోమంది యాంకర్లు ఉన్నారు ..కొంతమంది వస్తున్నారు ..మరి కొంత మంది ఫేడ్ అవుట్ అయిపోతున్నారు . కానీ సుమ మాత్రం ఎవర్ గ్రీన్ అని చెప్పాలి. తన యాంకరింగ్ స్టైల్ ప్రతిరోజు సరికొత్తగానే ఉంటుంది. వేసిన పంచ్ మళ్ళీ వేయకుండా ఎవరిని హర్ట్ చేయకుండా నవ్వించడంలో సుమ స్టైలే వేరు

ఫస్ట్ టైం ఆమెపై సోషల్ మీడియాలో నెగటివ్ ట్రోలింగ్ జరుగుతుంది. దానికి కారణం ఆమె రీసెంట్ గా క్యాష్ ప్రోగ్రాంలో ఇద్దరు హీరోలు పై చేసిన కామెంట్స్ నే అని తెలుస్తుంది. మనకు తెలిసిందే.. రీసెంట్గా క్యాష్ ప్రోగ్రాం లో బ్రహ్మాస్త్ర టీం ప్రమోషన్స్ కోసం వచ్చారు. బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ ఆమె భర్త రణబీర్ కపూర్, సినిమాకి తెలుగులో సమర్పికుడుగా వ్యవహరిస్తున్న రాజమౌళి అందరూ సినిమాకు ప్రమోషన్స్ లో భాగంగా క్యాష్ ప్రోగ్రాం కు వచ్చారు.

ఇక ముందుగానే ఫుల్ స్పీడ్ లో ఉండే సుమ రాజమౌళిని చూడగానే పంచులు మీద పంచులు వేస్తూ ఆయనను ఉక్కిరిబిక్కిరి చేసింది . అంతేనా విక్రమార్కుడు , ఆర్ఆర్ఆర్, బాహుబలి సినిమా ప్రమోషన్స్ కి రమ్మంటే రాలేదని . కానీ బ్రహ్మాస్త్ర సినిమాకు వచ్చారని పరోక్షంగా ఆయన పై కౌంటర్ వేసింది . అంతేకాదు ఈ ప్రోమోలో మనం చూసినట్లయితే సుమ రాజమౌళిని ఇరుకున పెట్టే ప్రశ్న వేసింది .

ఆర్ఆర్ఆర్ లో మీకు నచ్చిన పాత్ర ఏది.. ఎన్టీఆర్..? చరణ్..? అంటూ సూటిగా ప్రశ్నించింది. అయితే, దీనికి రాజమౌళి ఏం సమాధానం చెప్పారు అనేది మనం పూర్తి ఎపిసోడ్ లోనే చూడాలి . అయితే ప్రస్తుతం సుమని మాత్రం సోషల్ మీడియాలో చరణ్, ఎన్టీఆర్ ఫ్యాన్స్ విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. “అసలే ఇద్దరు ఫ్యాన్స్ కొట్టుకొని చస్తున్న క్రమంలో నువ్వు ఇలాంటి ప్రశ్న అడగడం సమంజసమా సుమ..?” అంటూ సూటిగా ప్రశ్నిస్తున్నారు. దీంతో సుమని కొందరు నెగిటివ్ గా ట్రోల్ చేస్తూ ఆమె పాపులారిటీని వాడుకుంటున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news