Moviesఆ టాలీవుడ్‌ యంగ్ హీరోకు పెళ్లి కుదిరింది... ప్రేమించిన అమ్మాయికే మూడు...

ఆ టాలీవుడ్‌ యంగ్ హీరోకు పెళ్లి కుదిరింది… ప్రేమించిన అమ్మాయికే మూడు ముళ్లు…!

టాలీవుడ్‌లో కరోనాకు ముందు వరకు మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్లు చాలామంది ఉండేవారు. అయితే కరోనా సమయంలో రానా- నిఖిల్ లాంటి యంగ్ హీరోలు పెళ్లి చేసుకుని ఫ్యామిలీ లైఫ్ లోకి ఎంటర్ అయ్యారు. అయితే ఇప్పటికీ కూడా 30 సంవత్సరాలు దాటేసి 40 సంవత్సరాలకు దగ్గరవుతున్న వారు…. ఇంకా చెప్పాలంటే 40 సంవత్సరాలు దాటుతున్నా పెళ్లి చేసుకోని ఎలిజబుల్ బ్యాచిలర్లు చాలామంది ఉన్నారు. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఈ లిస్టులో అగ్రస్థానంలో ఉంటారు.

ప్రభాస్ పెళ్లి గురించి గత పదియేళ్లుగా ఎన్నో వార్తలు వస్తున్నా ప్రభాస్ ఇప్పటికీ పెళ్లికి దూరంగానే ఉంటూ వస్తున్నాడు. ఇక మెగా ఫ్యామిలీ నుంచే సాయి ధరమ్ తేజ్- వరుణ్ తేజ్- వైష్ణవ తేజ్ లాంటి కుర్ర హీరోలు పెళ్లికి కాచుకుని ఉన్నారు. అక్కినేని ఫ్యామిలీ నుంచి అఖిల్ కూడా ఇంకా పెళ్లి చేసుకోలేదు. చాలామంది హీరోలు కెరీర్ పై దృష్టి పెట్టి పెళ్లి గురించి మర్చిపోవడంతో ఇంకా వారు బ్రహ్మచార్లుగానే ఉండిపోతున్నారు. ఇక మెగా హీరో సాయిధరమ్ తేజ్ కూడా గత కొన్నేళ్లుగా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నారు.

మధ్యలో ఒక హీరోయిన్‌తో సాయిధరమ్ తేజ్ ఎఫైర్ నడిపాడని ఆమెతో పీకల్లోతు ప్రేమలో ఉన్నాడని వార్తలు వచ్చినా ఆ తర్వాత అవన్నీ గప్‌చుప్ అయ్యాయి. అయితే గత ఏడాది చివర్లో సాయిధరమ్ తేజ్ బైక్ యాక్సిడెంట్‌తో పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్న సంగతి తెలిసిందే. ఇక విశ్వస‌నీయ‌ వర్గాల సమాచారం ప్రకారం వచ్చే రెండు నెలల్లో ఈ హీరో కూడా పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. యాక్సిడెంట్ నుంచి కోలుకున్నాక సాయి ధరంతేజ్ పెళ్లి గురించి ఒకటి రెండు సార్లు వార్తలు వచ్చాయి.

అయితే ఈసారి మాత్రం మనోడి పెళ్లి పక్కాగా ఫిక్స్ అయిపోయినట్టు తెలుస్తోంది. తాను మనసారా ప్రేమించిన అమ్మాయి మెడలోనే సాయి ధరంతేజ్ మూడు ముళ్లు వేయబోతున్నట్టు తెలుస్తోంది. ఇక వీరి పెళ్లి.. పెళ్లి కుమార్తె ఇంట్లోనే జరుగుతుందని సమాచారం. సాయికి కాబోయే భార్య ఇండ‌స్ట్రీతో సంబంధం లేని కుటుంబానికి చెందిన అమ్మాయి అని తెలుస్తోంది. ప్రస్తుతం సాయి తన మేనమామ పవన్ కళ్యాణ్ తో కలిసి కోలీవుడ్ హిట్ సినిమా వినోదయ సితం రీమేక్‌లో నటిస్తున్న సంగతి తెలిసిందే.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news