Moviesఆ టాలీవుడ్‌ హీరో అమ్మ‌కు... ఆ డైరెక్ట‌ర్‌తో ఎఫైర్ ఉందా... అందుకేనా...

ఆ టాలీవుడ్‌ హీరో అమ్మ‌కు… ఆ డైరెక్ట‌ర్‌తో ఎఫైర్ ఉందా… అందుకేనా అంత పెద్ద గొడ‌వ‌…!

టాలీవుడ్‌లో నాలుగైదేళ్ల క్రితం ఓ యంగ్ హీరో వ‌రుస ప్లాపుల్లో ఉండి ఓ మంచి హిట్ కొట్టాడు. ఆ హీరో రాక‌రాక వ‌చ్చిన హిట్ సినిమా కావ‌డంతో బాగా ప్ర‌మోట్ చేసుకున్నారు. వాళ్ల ఫ్యామిలీ అంతా ద‌గ్గ‌రుండి మ‌రీ ప్ర‌మోష‌న్లు చేసుకోవ‌డంతో ఆ సినిమా మంచి లాభాలు తీసుకువ‌చ్చింది. ఆ సినిమా త‌ర్వాత ఆ హీరో వ‌రుస పెట్టి కొన్ని సినిమాలు చేసినా అవేవి స‌క్సెస్ కాలేదు. అయితే ఆ హీరోతో ప‌రిచ‌యం అయిన ద‌ర్శ‌కుడు, హీరోయిన్ మాత్రం టాప్ ప్లేసులోకి వెళ్లిపోయారు.

ఆ సినిమా టైంలో త‌న‌కు లాభాలు రావ‌డంతో ఆ యంగ్ హీరో స‌ద‌రు డైరెక్ట‌ర్‌కు ఓ కాస్ట్ గిఫ్ట్ కూడా ఇచ్చాడు. అయితే ఆ గిఫ్ట్‌ను ఆ డైరెక్ట‌ర్ రిజెక్ట్ చేశాడు. సినిమాకు ముందు వ‌ర‌కు ఎంతో క‌లిసి మెలిసి ఉన్న వారు.. ఆ త‌ర్వాత బ‌ద్ధ శ‌త్రువులు అయిపోయారు. స‌ద‌రు డైరెక్ట‌ర్‌పై ఆ హీరో క‌త్తులు దూయ‌డం స్టార్ట్ చేశాడు. అత‌డి అంతు చూస్తాన‌ని మ‌రీ స‌వాల్ చేశాడు. ఆ త‌ర్వాత ఆ డైరెక్ట‌ర్ మ‌రో కుర్ర క్రేజీ హీరోతో సినిమా చేసి మ‌ళ్లీ బంప‌ర్ హిట్ కొట్టాడు.. అది వేరే సంగ‌తి.

ఇక ఆ డైరెక్ట‌ర్‌కు ఆ కుర్ర హీరోకు మ‌ధ్య అంత‌లా ప‌చ్చ‌గ‌డ్డి వేస్తే భ‌గ్గుమ‌న‌డానికి కార‌ణం ఏంటా ? అని ఆరా తీస్తే అప్పట్లో మీడియా వ‌ర్గాల్లో వినిపించిన గుస‌గుస ఏంటంటే ఆ హీరో అమ్మ‌కు, ఆ డైరెక్ట‌ర్‌కు ఎఫైర్ ఉంద‌ట‌. వీరిద్ద‌రు ఇష్ట‌ప‌డే కొన్నాళ్లు ఎంజాయ్ చేశారు. అయితే అది ఆ హీరోకు తెలియ‌డంతో.. త‌న అమ్మ‌తోనే ఎఫైర్ పెట్టుకుంటాడా ? అని ఆ కుర్ర హీరో డైరెక్ట‌ర్‌పై ర‌గిలిపోవ‌డంతో పాటు గ‌ట్టిగానే టార్గెట్ చేస్తూ రుస‌రుస‌లాడాని అప్ప‌ట్లో టాక్ వినిపించింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news