Moviesఒక్కోక్కడిగా పగిలిపోవాలే..లైగర్ ప్రీరిలీజ్ ఈవెంట్ లో దిమ్మతిరిగే ఆన్సర్ ఇచ్చిన పూరి...

ఒక్కోక్కడిగా పగిలిపోవాలే..లైగర్ ప్రీరిలీజ్ ఈవెంట్ లో దిమ్మతిరిగే ఆన్సర్ ఇచ్చిన పూరి జగన్నాధ్.!!

టాలీవుడ్ డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ సినిమాల పరంగా హిట్ కొట్టి చాలా కాలమే అయినా.. ఆయన ఒంట్లోని పవర్ ..మాటల్లోని పొగరు అస్సలు తగ్గలేదు అనే అంటున్నారు అభిమానులు. ప్రజెంట్ పూరి జగన్నాథ్ ప్రతిష్టాత్మకంగా తీసుకొని డైరెక్ట్ చేసిన సినిమా లైగర్ రిలీజ్ కు సిద్ధంగా ఉంది. ఆగస్టు 25వ తేదీ సినిమా గ్రాండ్ గా పాన్ ఇండియా ఆ లెవెల్లో రిలీజ్ కాబోతుంది. ఆశ్చర్యం ఏమిటంటే ఈ సినిమా కోసం టాలీవుడ్ జనాలు కన్నా బాలీవుడ్ వర్గాలు ఎక్కువగా వెయిట్ చేస్తున్నాయి. దానికి కారణం వన్ అండ్ ఓన్లీ రౌడీ హీరో విజయ్ దేవరకొండ.

మనకు తెలిసిందే అర్జున్ రెడ్డి సినిమాతో విజయ్ దేవరకొండ స్టార్ స్టేటస్ పూర్తిగా మారిపోయింది. ఒక్క సినిమాతో ఆయన తన తలరాతను తానే మార్చేసుకున్నాడు. ప్రజెంట్ ఎక్కడ చూసినా విజయ్ దేవరకొండ కటౌట్స్ ..విజయ్ దేవరకొండ పేరే మారుమ్రోగిపోతుంది. దానికి కారణం ఆయన హీరోగా నటించిన లైగర్ సినిమా మరి కొద్ది రోజుల్లో రిలీజ్ కాబోతుండడమే. కాగా సినిమా రిలీజ్ డేట్ దగ్గర కు వస్తుండడంతో.. గుంటూరులో ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా చేసారు మూవీ టీం. ఈ ఈవెంట్ లో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచారు విజయ్ దేవరకొండ, అనన్యపండే.

అయితే పూరి జగన్నాథ్ ఈ ఈవెంట్లో మాట్లాడిన మాటలు ఇప్పుడు ఇండస్ట్రీలో సంచలనంగా మారాయి. లైగర్ సినిమా కన్నా కూడా పూరి జగన్నాథ్ ఈ ఈవెంట్లో తన డ్రీమ్ ప్రాజెక్ట్ జనగణమన గురించే ఎక్కువగా మాట్లాడారు. అదే ఇప్పుడు లైగర్ ను పెద్ద చిక్కుల్లో పడేసింది. లైగర్ సినిమా మీకు నచ్చుతుంది అంటూ పూరి జగన్నాథ్ చెప్పిన కామెంట్స్ కన్నా లైగర్ కన్నా ఢబుల్ భారీ బడ్జెట్ తో జనగణమన తీయబోతున్నాం అని చెప్పిన డైలాగ్స్ నే ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో వైరల్ అవుతుంది. అంటే దీన్ని బట్టి చూస్తే పూరి జగన్నాథ్ కి లైగర్ కన్నా కూడా జనగణమన పైన ఎక్కువ ఇంట్రెస్ట్ ఉందని కొందరు ఆయన ట్రోల్ చేస్తున్నారు. మరో పక్క పూరి జగన్నాథ్ అభిమానులు మాత్రం లైగర్ సినిమాతో ఒక్కొక్కడికి పగిలిపోయే ఆన్సర్ ఇస్తాడు మా పూరి అన్న.. అంటూ పూరి ని ఓ రేంజ్ లో పొగిడేస్తున్నారు . మరి చూడాలి పూరి జగన్నాథ్ కెరీర్ ని ఈ లైగర్ సినిమా ఎలా మలుపు తిప్పుతుందో..!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news