Moviesభానుప్రియపై పిచ్చి ప్రేమతో డైరెక్ట‌ర్ వంశీ చేసిన ఈ పని తెలుసా.....

భానుప్రియపై పిచ్చి ప్రేమతో డైరెక్ట‌ర్ వంశీ చేసిన ఈ పని తెలుసా.. ?

భానుప్రియా.. తెలుగు సినిమా ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎంతో తెలుగుదనం ఉట్టిపడుతూ అచ్చ తెలుగు పాత్రలకు చక్కగా సరిపోతుంది. ఆమె సినిమా జీవితం… వ్యక్తిగత జీవితం తెరిచిన పుస్తకమే. కానీ భానుప్రియ‌ జీవితంలో మాత్రం కొన్ని విషయాలలో ఇబ్బందులను ఎదుర్కొంది. మరీ ముఖ్యంగా పెళ్లి విషయంలో చిక్కుల్లో పడినట్టుగా కొన్ని వార్తలు వచ్చాయి. ప్రముఖ దర్శకుడు వంశీ తో పీకల్లోతు ప్రేమలో పడిన భానుప్రియ, పెళ్లి మాత్రం చేసుకోలేకపోయింది. అసలు వీరి ప్రేమ, పెళ్లి విషయంలో ఏం జరిగిందో చూస్తే ఇంట్ర‌స్టింగ్ విష‌యాలు చాలానే ఉంటాయి.

తెలుగులో సితార సినిమాతో హీరోయిన్ గా తొలిసారి వంశీ దర్శకత్వంలో పరిచయమైన భానుప్రియ అంతకన్నా ముందే తమిళంలో ఓ సినిమాలో నటించింది. సితార సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ఇక అమె వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. ఇక సితార హిట్ కావడంతో వంశీ – భానుప్రియ కాంబినేషన్ కి మంచి క్రేజ్ ఏర్పడింది. ఆ తరువాత వీరిద్దరి కాంబినేషన్లోనే ప్రేమించు పెళ్ళాడు, ఆలాపన, అన్వేషణ వంటి అద్భుతమైన సినిమాలు తెలుగులో విడుదలయ్యాయి.

 

 

ప్రేమించు పెళ్ళాడు సినిమా కాస్త పరవాలేదు అనిపించినా పాటలు మాత్రం అద్భుతంగా ఉంటాయి. ఇక అన్వేషణ సినిమా గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. సినిమా కెరియర్ విషయంలో భానుప్రియను వంశీ బాగా ఎంకరేజ్ చేశాడనే చెప్పుకోవాలి. ఆమె మిగతా దర్శకుల సినిమాల్లో నటిస్తున్న ప్రతి విషయంలో వంశీ సలహాలు తీసుకుంటూ ఉండేది. అలా వీరిద్దరి మధ్య ప్రేమ బంధం పుట్టింది. వంశీ భానుప్రియను ఎంతగానో ఆరాధించాడు. ఆమెకు చిన్న కష్టం వచ్చినా ఆయన తట్టుకునేవాడు కాదు.

షూటింగ్ లొకేషన్లో ఎవరి వల్ల ఆయన భానుప్రియ బాధపడితే వెంటనే సారీ చెప్పమని గట్టిగా వార్నింగ్ ఇచ్చేవాడు. అలా వీరి ప్రేమ బంధం అందరికీ తెలిసిపోయింది. ఆ రూమర్స్ నిజం కాదని ఇద్దరు చెప్పకపోవడంతో ఆనోటా ఈనోటా ఈ విషయం భానుప్రియ తల్లికి అలాగే వంశీ భార్యకి తెలిసిపోయింది. భానుప్రియ తల్లి సైతం వంశీతో ఆమె పెళ్లి విషయంలో ఒప్పుకోలేదు. వంశీకి అప్పటికే పెళ్లి కావడంతో వారి ప్రేమను అమె అంగీకరించలేదు. తల్లి చెప్పిన మాట తూచా తప్పకుండా పాటించే భానుప్రియ వంశీని దూరం పెట్టింది. ఆ ఎడబాటును సైతం వంశీ తట్టుకోలేకపోయాడు.

ఓ రోజు నేరుగా భానుప్రియ ఇంటికి వెళ్లి ఆమెను పెళ్లి చేసుకుంటానని అడగగా మరోసారి ఇంటి వైపు కన్నెత్తి చూడకూడదంటూ వంశీకి వార్నింగ్ ఇచ్చింది భానుప్రియ తల్లి. అలా వీరి ప్రేమ బంధం మధ్యలోనే ఆగిపోయింది మరోవైపు వంశీ భార్య సైతం తనకు అన్యాయం చేస్తే ఊరుకోను అంటూ అతడిని కట్టుదిట్టం చేయడంతో వీరి ప్రేమకు శాశ్వతంగా బ్రేక్ పడింది. ఆ తర్వాత ఎవరి జీవితాల్లో వారు బిజీ అయ్యారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news