Moviesఆ స్టార్ హీరోతో లైగ‌ర్ బ్యూటీ ల‌వ్ స్టోరీ గురించి తెలుసా...?...

ఆ స్టార్ హీరోతో లైగ‌ర్ బ్యూటీ ల‌వ్ స్టోరీ గురించి తెలుసా…? ఆ హీరోయినే చిచ్చు పెట్టిందా…!

టాలీవుడ్ లో హీరోయిన్ల‌తో హీరోలు డేటింగ్ చేయ‌డం చెట్టాప‌ట్టాలేసుకుని తిర‌గ‌టం చాలా త‌క్కువ‌గా క‌నిపిస్తాయి. టాలీవుడ్ లోనే కాదు సౌత్ ఇండ‌స్ట్రీలోనే హీరోయిన్లతో డేటింగ్ లు ప్రేమాయ‌ణాలు చాలా త‌క్కువ‌. కానీ బాలీవుడ్ క‌ల్చ‌ర్ చాలా భిన్నంగా ఉంటుంది. అక్క‌డ హీరోయిన్ లు హీరోలు డేటింగ్ చేయ‌డం చాలా కామ‌న్. అంతే కాకుండా కుర్ర హీరోలు సీనియ‌ర్ హీరోయిన్ల‌ను సైతం ప్రేమిస్తుంటారు. వ‌య‌స్సులో త‌మ‌కంటే పెద్ద‌వాళ్లు అయిన హీరోయిన్ల‌తో రొమాన్స్‌, డేటింగ్‌లు చేసి పెళ్లిళ్లు చేసుకున్న హీరోల‌ను మ‌నం చూస్తున్నాం.

ఇక పిల్లలు పెళ్లి వ‌య‌సుకు వ‌చ్చినా భార్య‌ల‌కు విడాకులు ఇస్తూ హీరోయిన్ల‌ను పెళ్లి చేసుకునే హీరోలు కూడా ఉన్నారు. ఇక కుర్ర హీరోయిన్ ల గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. డ్రెస్ మార్చినంత ఈజీగా బాయ్ ఫ్రెండ్స్ ను మార్చేస్తుంటారు. ఇక లైగ‌ర్ బ్యూటీ అన‌న్య పాండే కూడా అదే టైప్ అని చెప్ప‌డంలో ఎలాంటి సందేహం అవ‌స‌రం లేదు. ఈ అమ్మ‌డు సైజ్ జీరోతో బాలీవుడ్ లో చాలా మంది హీరోల‌ను త‌న వెంట తిప్పుకుంది. బాలీవుడ్ హీరో ఇషాన్ క‌త్త‌ర్ తో ఈ బ్యూటీ చాలా రోజులు ప్రేమాయ‌ణం న‌డిపింద‌ని టాక్. కానీ కొంత కాలం డేటింగ్ త‌ర‌వాత వీరిద్ద‌రూ గుడ్ బై చెప్పుకున్నారు.

ఆ త‌ర‌వాత అన‌న్య పాండే హీరో కార్తీక్ ఆర్య‌న్ తో ప్రేమ‌లో ప‌డిపోయింద‌ట‌. కార్తీక్ ఆర్య‌న్ తో కూడా అన‌న్య చాలా కాలం డేటింగ్ లో ఉంది. వీరిద్ద‌రూ చెట్టాప‌ట్టాలేసుకుని తిర‌గారు కూడా. కానీ కొంత కాలం త‌ర‌వాత బోర్ కొట్టిందో ఏమోగాని బ్రేక‌ప్ చెప్పుకున్నారు. వీరిద్ద‌రి బ్రేక‌ప్‌కు కార్తీక్ సారా అలీఖాన్ తో క్లోజ్ గా ఉండ‌టం కూడా ఒక రీజ‌న్ అనే వార్త‌లు బాలీవుడ్ లో జోరుగా వినిపించాయి. సారాయే కార్తీక్ ఆర్య‌న్ – అన‌న్య మ‌ధ్య చిచ్చు పెట్టేసింద‌ని అంటారు.

ఇదిలా ఉండ‌గా ఇటీవ‌ల విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో క‌లిసి అన‌న్య లైగ‌ర్ ప్ర‌మోష‌న్స్ కోసం కాఫీ విత్ క‌ర‌ణ్ షోలో సంద‌డి చేసింది. కాగా ఆ షోలో క‌ర‌ణ్ జోహార్ మాట్లాడుతూ…. నా బర్త్ డే పార్టీలో ఆదిత్యరాయ్ క‌పూర్ తో చాలా క్లోజ్ గా ఉన్నావ్ అంటూ బాంబు పేల్చాడు. దాంతో అన‌న్య ఆదిత్య‌రాయ్ క‌పూర్ అంటే నాకు చాలా ఇష్టం..చాలా అందంగా ఉంటాడు అంటూ కామెంట్స్ చేసింది. దాంతో అన‌న్య ఇప్ప‌డు ఆదిత్య‌రామ్ క‌పూర్ పై మన‌సుపారేసుకుంది అంటూ బాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news