Moviesబాల‌య్య‌, ఎన్టీఆర్ ఫ్యాన్స్‌ ' నంద‌మూరి ' ఫ్యాన్స్‌గా ఒక్క‌టైన వేళ‌...!

బాల‌య్య‌, ఎన్టీఆర్ ఫ్యాన్స్‌ ‘ నంద‌మూరి ‘ ఫ్యాన్స్‌గా ఒక్క‌టైన వేళ‌…!

చాలా కాలం తరవాత టాలీవుడ్ లో కొన్ని మంచి పరిణామాలు చోటు చేసుకున్నాయి. చాలా రోజుల త‌ర్వాత నంద‌మూరి హీరో క‌ళ్యాణ్‌రామ్ బింబిసారా సినిమాతో త‌న కెరీర్‌లోనే ఆల్ టైం బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్‌ను త‌న ఖాతాలో వేసుకున్నాడు. అలాగే ఇటీవ‌ల టాలీవుడ్‌లో థియేట‌ర్ల‌కు ప్రేక్ష‌కులు వ‌స్తారా రారా ? అన్న సందేహాల‌తో పాటు జూలైలో వ‌రుస ప్లాపుల భ‌యాన్ని తొల‌గిస్తూ బింబిసార హిట్ అయ్యింది. అటు సీతారామం క్లాస్‌కు ఎక్కితే, బింబిసార మాస్‌కు పిచ్చ‌గా ఎక్కేసింది.

ఇక బింబిసార ఇటీవ‌ల ఏ టాలీవుడ్‌కు సినిమాకు కాన‌ట్టుగా కేవ‌లం 3 రోజుల‌కే బ్రేక్ ఈవెన్ అయిపోయింది. అయితే ఇదే సినిమా నంద‌మూరి ఫ్యాన్స్‌లో స‌రికొత్త జోష్ నింపింది. ఇప్ప‌టికే నంద‌మూరి అభిమానులు అఖండ‌, త్రిబుల్ ఆర్ హిట్ జోష్‌లో ఉండ‌గా.. ఇప్పుడు వారి జోష్‌ను కంటిన్యూ చేస్తూ బింబిసార నంద‌మూరి హీరోల‌కు హ్యాట్రిక్ హిట్ అయ్యింది. ఈ సినిమాకు తొలి మూడు రోజుల్లో బయ్యర్లు సేఫ్ అయ్యి… నిర్మాతకు ఓవర్ ఫ్లోస్ స్టార్ట్ కావడం చాలా గొప్ప విష‌యం ఇప్పుడున్న ప‌రిస్తితుల్లో..!

ఈ సినిమాతో జ‌రిగిన మ‌రో గొప్ప విశేషం ఏంటంటే బాల‌య్య ఫ్యాన్స్‌, ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంతా ఒక్క‌టిగా నంద‌మూరి ఫ్యాన్స్‌గా మారారు. ఈ ఫ్యానిజం క‌ళ్యాణ్‌రామ్‌కు కూడా బాగా క‌లిసి వ‌చ్చింది. ఇప్ప‌టి వ‌ర‌కు బాల‌య్య ఫ్యాన్స్‌లో కొంద‌రు, ఎన్టీఆర్ ఫ్యాన్స్‌లో కొంద‌రి మ‌ధ్య చిన్న చిన్న అర‌మ‌రిక‌లు ఉన్నాయి. అయితే బింబిసార విష‌యంలో వారంతా ఏక‌మై నంద‌మూరి ఫ్యాన్స్ అయిపోయారు. ఇక టాలీవుడ్‌లో మిగిలిన హీరోల అభిమానులు కూడా క‌ళ్యాణ్‌రామ్‌ను నో నెగ‌టివిటి స్టార్‌గా చూస్తారు.

క‌ళ్యాణ్ వివాదాల జోలికిపోడు. ఈ ఫ్యానిజం అంతా క‌లిసి ఈ సినిమాకు మ‌రింత బ్లాక్‌బ‌స్ట‌ర్ టాక్ తీసుకు రావ‌డానికి చాలా ఉప‌యోగ‌ప‌డింది. దీంతో పాటు ప్రేక్ష‌కుల‌కు కూడా పిచ్చ‌గా న‌చ్చ‌డంతో సినిమాను ముందుకు తీసుకెళ్లిపోయారు. ఇలా క‌ళ్యాణ్ త‌న కెరీర్ బ్లాక్‌బ‌స్ట‌ర్ కొట్ట‌డంతో పాటు నంద‌మూరి ఫ్యాన్స్‌ను ఒక్క‌టి చేశాడు. దీంతో పాటు గత కొంత కాలంగా టాలీవుడ్ ను అయోమయానికి గురిచేస్తున్న థియేటర్ల విష‌యంలో ఈ సినిమాతో క్లారిటీ వ‌చ్చేసింది. స‌రైన కంటెంట్ ఉంటే ప్రేక్ష‌కులు థియేట‌ర్ల‌కు త‌న్నుకు వ‌స్తార‌ని కూడా బింబిసార ఫ్రూవ్ చేసింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news