Moviesఆ హీరో విషయంలో తప్పు నాదే..షాకింగ్ విషయాని బయటపెట్టిన V V...

ఆ హీరో విషయంలో తప్పు నాదే..షాకింగ్ విషయాని బయటపెట్టిన V V వినాయక్ ..!!

తప్పు అందరు చేస్తారు. తప్పులు చేయడం మానవ గుణం. కానీ, ఆ తప్పులను ధైర్యంగా ఒప్పుకున్న వాడే..నిజమైన మనిషి. ప్రస్తుతం అలాంటి పనే చేశాడు స్టార్ డైరెక్టర్ వి వి వినాయక్. ఈ పేరు కు ఇప్పుడంటే డిమాండ్ లేదు కానీ, ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీకి మంచి మంచి హిట్స్ ఇచ్చిన డైరెక్టర్. ఒకప్పుడు సినీ ఇండస్ట్రీని షేక్ చేసిన ఠాగూర్ సినిమా తెరకెక్కించింది ఈయనే.

మరి ఇంత పెద్ద డైరెక్టర్ కి ఇప్పుడు సినిమా అవకాశాలే లేవు. దానికి కారణాలు ఎన్ని ఉన్నా..మారుతున్న కాలానికి కొత్త డైరెక్టర్లు..కొత్త కధలను తీసుకురావడం తో ఈయన వెనక పడిపోయారు. కానీ , ఇండస్ట్రీలో ఈయన అంటే..చాలా క్రేజ్ ఉంది. ఇప్పటికి ఈయనకి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అయితే, తాజాగా ఓ ఇంటర్వ్యుల్లో మాట్లాడుతూ..ఆయన స్టార్ హీరో కొడుకు అఖిల్ విషయంలో తప్పు చేశాను అంటూ అసలు విషయం బయట పెట్టాడు.

మనకు తెలిసిందే..నాగార్జున కొడుకు అఖిల్ ని ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ చేసింది ఈయనే. అఖిల్ సినిమాతోనే అఖిల్ సినిమా ఇండస్ట్రీలోకి వచ్చాడు. అయితే, ఎవ్వరైన ఫస్ట్ మూవీని రొమాంటిక్, లవ్, కామెడీ ఎంటర్ టైనర్ మూవీ గా చేయాలి అనుకుంటారు. కానీ, అఖిల్ ని మాత్రం..ఫుల్ యాక్షన్ లుక్ లో చూయించాడు డైరెక్టర్ వినాయక్. దీంతో ఆ సినిమా బాక్స్ ఆఫిస్ వద్ద బోల్తా కొట్టింది ఈ సినిమా. ఒక్కవేళ ఆయన ఈ సినిమాను మరే హీరోతో తెరకెక్కించిన ఇలా ఫ్లాప్ అయ్యుండేది కాదు. అఖిల్ లాంటి సాఫ్ట్ బాయ్ ని ఫుల్ యాక్షన్ లో చూయించేసరికి..సినిమా దెబ్బేసింది. అదే విషయాని..చెప్పుకొచ్చాడు వినాయక్.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news