Moviesలండ‌న్‌కు మ‌హేష్ వార‌సుడు గౌత‌మ్‌... అది పూర్త‌య్యాకే హీరోగా ఎంట్రీ...!

లండ‌న్‌కు మ‌హేష్ వార‌సుడు గౌత‌మ్‌… అది పూర్త‌య్యాకే హీరోగా ఎంట్రీ…!

టాలీవుడ్ సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌బాబు ఈ స‌మ్మ‌ర్‌లో స‌ర్కారు వారి పాట సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు. ప్ర‌స్తుతం మ‌హేష్‌.. మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ డైరెక్ష‌న్‌లో ఓ సినిమాలో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. అయితే ఈ సినిమా సెట్స్ మీద‌కు వెళ్లేందుకు టైం ఉండ‌డంతో మ‌హేష్ విదేశీ వెకేష‌న్ల‌తో ఫుల్ బిజీ ఉన్నాడు. న‌మ్ర‌తతో పాటు త‌న కిడ్స్‌తో క‌లిసి ఫారిన్ టూర్‌లో ఎంజాయ్ చేస్తున్నాడు.

అయితే మ‌హేష్ అమెరికా టూర్ ముగిసిన వెంట‌నే ఇప్పుడు లండ‌న్ వెళ్లాడు. దీనికి ఓ కార‌ణం కూడా ఉంద‌ని తెలిసింది. మ‌హేష్ త‌న‌యుడు గౌత‌మ్ విదేశాల్లో బెస్ట్ స్కూల్స్‌లో చ‌దువుతున్నాడు. ఓ ప్ర‌ముఖ తెలుగు నిర్మాత త‌న‌యుడు అక్క‌డ అడ్మిష‌న్ పొందిన స్కూల్లోనే ఇప్పుడు మ‌హేష్ త‌న‌యుడు గౌత‌మ్ కృష్ణ అడ్మిష‌న్ కోసం ట్రై చేస్తున్నార‌ట‌.

మ‌హేష్ ఫ్యామిలీ ఇప్ప‌టికే లండ‌న్‌లో ఆ కాలేజ్‌కు వెళ్లిరాగా.. ఇప్పుడు ఫ్యామిలీతో స‌హా మ‌రోసారి ఆ క్యాంప‌స్‌ను సంద‌ర్శించ‌నున్నార‌ట‌. ఆగ‌స్టులో గౌత‌మ్ లండ‌న్ వెళ‌తాడ‌ని తెలుస్తోంది. టాలీవుడ్ న‌ట వార‌సులు విదేశాల్లో ఉన్న‌త విద్య అభ్య‌సించ‌డం రెగ్యుల‌ర్‌గా చూస్తున్న‌దే. మ‌హేష్ కూడా కెరీర్‌కు ముందు అమెరికాలో స్ట‌డీస్ చేశాడు.

సీనియ‌ర్ హీరోలు విక్ట‌రీ వెంకటేష్‌, నాగార్జున ఇద్ద‌రూ కూడా అమెరికాలో ఉన్న‌త విద్య అభ్య‌సించి వ‌చ్చిన వారే. నేటి త‌రం యంగ్ హీరోలు కూడా సినిమాల్లోకి రావ‌డానికి ముందు విదేశాల్లో ఉన్న‌త చ‌దువులు చ‌దివి ఆ త‌ర్వాత ఇక్క‌డ‌కు వ‌చ్చారు. ఇప్పుడు ఆ కోవ‌లోనే మ‌హేష్ త‌న‌యుడు గౌత‌మ్ సైతం లండ‌న్ స్కూల్లో చ‌దివేందుకు రెడీ అవుతున్నాడు.

 

ఇక గౌత‌మ్ అందంలో త‌న తండ్రిని మ‌హేష్‌ని మించే ఉంటాడు. ఫుల్ వైట్‌గా, క్యూట్‌గా ఉంటూ త‌న లుక్స్‌తోనే క‌ట్టిప‌డేస్తాడు. ఇక లండ‌న్ విద్య పూర్త‌య్యాకే గౌత‌మ్ సినిమాల్లోకి వ‌స్తాడ‌ని తెలుస్తోంది. వార‌సుడిని హీరోగా చేసేందుకు మ‌హేష్ – న‌మ్ర‌త ఇద్ద‌రూ సుముఖంగానే ఉన్న‌ట్టు తెలుస్తోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news