Moviesహీరోయిన్ల శ‌రీరం.. హీరోల ఛాతిపై సీనియ‌ర్ హీరోయిన్ బోల్డ్ కామెంట్ల ర‌చ్చ‌...!

హీరోయిన్ల శ‌రీరం.. హీరోల ఛాతిపై సీనియ‌ర్ హీరోయిన్ బోల్డ్ కామెంట్ల ర‌చ్చ‌…!

ఒక‌ప్ప‌టితో పోలిస్తే నేటిత‌రం న‌టీన‌టుల‌కు అవ‌కాశాలు పెరిగాయి. ఇందుకు ప్ర‌ధాన కార‌ణం. ఇప్పుడు ఉన్న‌ది అంతా డిజిట‌ల్ మీడియా యుగం. ఈ నేప‌థ్యంలోనే వెండితెర, బుల్లితెర ఇలా ఏదో ఒక చోట ఇప్పుడు అవ‌కాశాలు బాగానే వ‌స్తున్నాయి. కొంద‌రు సొంత యూట్యూబ్‌ల‌తోనూ, మ‌రి కొంద‌రు ఓటీటీల‌తోనూ కూడా గ‌ట్టిగానే వెన‌కేసుకుంటున్నారు.

ఇదే విష‌యంపై సీనియ‌ర్ హీరోయిన్ కాజ‌ల్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. కాజ‌ల్ ఓటీటీల‌ను తెగ పొగిడేశారు. పెద్ద తెర‌తో స‌మానంగా ఇప్పుడు ఓటీటీలు శాసిస్తున్నాయ‌ని.. ఓటీటీ రంగంలోని న‌టీమ‌ణుల గురించి మాట్లాడుతూ నిజంగా ఈ రంగంలో టాలెంట్ ఉన్న వాళ్లు బ‌య‌ట‌కు వ‌స్తున్నార‌ని.. త‌మ సొంత ప్ర‌తిభ‌తోనే ఎదుగుతున్నార‌ని కాజ‌ల్ మెచ్చుకుంది.

ఇక హీరోయిన్ల శ‌రీరాకృతిపైనా కాజ‌ల్ బోల్డ్ కామెంట్లు చేశారు. 24 అంగుళాల న‌డుము, 36 అంగుళాల కొల‌త‌లు లేక‌పోయినా.. ఈ రోజుల్లో న‌టీమ‌ణుల‌కు ఛాన్సులు వ‌స్తున్నాయని.. ఇక హీరోలు అవ్వాలంటే 46 అంగుళాల ఛాతి చూపించాల్సిన అవ‌స‌రం లేద‌ని కూడా కాజ‌ల్ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్య‌లు ఇప్పుడు నెట్టింట్లో ర‌చ్చ లేపుతున్నాయి. బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ స‌ర‌స‌న ఎన్నో సూప‌ర్ డూప‌ర్ హిట్ సినిమాల్లో న‌టించిన కాజ‌ల్‌.. 30 ఏళ్ల పాటు న‌టించింది.

పెళ్ల‌య్యాక ఇటీవ‌ల కూడా ఆమె షారుఖ్‌తో క‌లిసి సినిమా చేసింది. ఇక సౌత్ ఇండియ‌న్ సినిమాల‌లో కూడా ఆమె క్యారెక్ట‌ర్ న‌టిగా ఎన్నో సినిమాల్లో న‌టించింది. రేవతి తెరకెక్కిస్తున సలామ్ వెంకీలో కాజోల్ కనిపించనుంది. అంత‌కుముందే ధ‌నుష్ వీఐపీ సినిమాలోనూ ధ‌నుష్‌తో ఢీ అంటే ఢీ అనే రేంజ్‌లో ఢీ కొట్టే పాత్ర‌లో కనిపించింది. ఇక స్టార్ హీరో అజ‌య్ దేవ‌గ‌న్‌ను పెళ్లాడిన కాజ‌ల్ ఇటు న‌టిగారు, అటు నిర్మాత‌గాను త‌న వంతు ప్ర‌య‌త్నాల్లో బిజీ అయిపోయింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news