Moviesఆ ఒక్క ప‌ని చేశాడంటే పూరిని పూజా జీవితంలో వ‌ద‌ల‌దు...!

ఆ ఒక్క ప‌ని చేశాడంటే పూరిని పూజా జీవితంలో వ‌ద‌ల‌దు…!

స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తన సినిమాలలో హీరోయిన్స్‌ను ఏ రేంజ్‌లో చూపిస్తారో అందరికీ తెల్సిసిందే. కొత్త అమ్మాయి అయినా, ఆల్రెడీ సక్సెస్‌లో ఉన్న హీరోయిన్ అయినా పూరి మార్క్ పడితే మరో రకంగా క్రేజ్ వచ్చేయాల్సిందే. అప్పటివరకు ప్రియమణి చేసిన సినిమాలన్నీ ఒకెత్తైతే, గోలీమార్ సినిమా ఒకెత్తు. ఇందులో బీచ్ సాంగ్ చాలు ప్రియమణి అందాలు చూడటానికి. నితిన్ సరసన ద్రోణ సినిమాలో నటించిన ప్రియమణి..బికినీ వేసి చమటలు పట్టించింది. అయినా పూరి చూపించిన స్టైల్ మరో లెవల్. పూరి సినిమాలో హీరోను ఏ రేంజ్‌లో చూపిస్తాడో హీరోయిన్‌ను వెనకా ముందు అంతకు మించి అనేట్టుగా చూపిస్తారు.

ఆయన సినిమాలో ఉన్నంత హాట్‌గా హీరోయిన్స్ మరో సినిమాలో కనిపించరెందుకో. బహుశా రాం గోపాల్ వర్మ శిష్యుడు కాబట్టే ఈ యాంగిల్స్ అన్నీ బాగా వంటపట్టినట్టున్నాయి. నడుం చూపించాలన్నా..నాభి చూపించాలన్నా..కళ్ళ పాదాల దగ్గర్నుంచి కళ్ళ వరకు కొత్తగా చూపిస్తుంటారు. పెగ్ వేయకుండానే మత్తెక్కేలా స్క్రీన్ మీద పూరి హీరోయిన్స్ అందాల ఆరబోత ఉంటుంది. ఇప్పటి వరకు ఆయన సినిమాలో హీరోయిన్స్ సక్సెస్ కావడానికి ఇదీ ఒక కారణం అని చెప్పొచ్చు.

ఇప్పుడు పూజా హెగ్డే వంతు వచ్చింది. ఆయన దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా జనగణమన సినిమా తెరకెక్కుతోంది. ఇది పూరి జగన్నాథ్ డ్రీం ప్రాజెక్ట్. ఈ డ్రీం ప్రాజెక్ట్‌లో హీరోయిన్‌గా పూజాను ఎంచుకున్నారు పూరి. సాధారణంగా స్టార్ హీరోయిన్‌ను ఎప్పుడూ పూరి తన సినిమాలలో తీసుకుంది లేదు. కానీ, మొదటిసారి ఇటు సౌత్‌లో అటు నార్త్‌లో మంచి క్రేజ్ మీదున్న పూజా హెగ్డేను ఎంచుకున్నారు. దీన్ని బట్టి చూస్తే ఏదో కొత్త విషయం పూజా దగ్గర పూరి చూసినట్టున్నారు.

అందుకే, తన డ్రీం ప్రాజెక్ట్‌కు ఏరికోరి పూజాను తీసుకున్నారు పూరి. మరి అంతగా పూజా ఏం చూపించింది..అనేది మాత్రం జనగణమన చూస్తేనే అర్థమవుతుంది. ఈ సినిమాను పాన్ ఇండియా రేంజ్‌లో వచ్చే ఏడాది ఆగ‌స్టు నెలలో రిలీజ్ చేయబోతున్నారు. ఏ హీరోయిన్ అయినా అందరితో సినిమా చేయడం వేరు..పూరితో సినిమా చేయడం వేరు. అందుకే ప్రతీ హీరోయిన్ ఆయన దర్శకత్వంలో నటించాలని తహతహలాడుతుంటుంది. ఆ తహ తహా పూజాకు ఉందని తెలుస్తోంది. పూరి గనక హిట్ ఇస్తే జీవితంలో పూరిని వదలేమో..!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news