Moviesఆ ఒక్క వీడియో దీక్ష సేథ్ జివితాని తలకిందులు చేసేసిందా..?

ఆ ఒక్క వీడియో దీక్ష సేథ్ జివితాని తలకిందులు చేసేసిందా..?

దీక్ష సేథ్.. ఈ పేరు చాలా మంది జనాలు మర్చిపోయుంటారు. ఎందుకంటే అమ్మడు ఇప్పుడు సినిమా లు చేయట్లేదు. సినీ ఇండస్ట్రీలో అన్ని ఉన్నా అదృష్టం కూడా ఉండాలి అప్పుడే హీరోయిన్ గా సక్సెస్ అవ్వగలరు. 2009 లో దీక్ష కాలేజ్ లో ఉన్నప్పుడు ఫెమీనా మిస్ ఇండియా కాంటెస్ట్ లో పాల్గొన్నారు. మోడలింగ్ లో అనుభవం లేకపోయిన కూడా మిస్ ఇండియా కాంటెస్ట్ లో టాప్ టెన్ ఫైనలిస్ట్స్ లో ఒకరిగా నిలిచారు ఈ ముద్దుగుమ్మ.

అలానే మిస్ ఫ్రెష్ ఫేస్ అనే టైటిల్ కూడా గెలుచుకున్నారు దీక్షా అన్ని ఉన్నా అల్లుడి నోట్లో సని అన్నట్లు ఈ బ్యూటీకి అందం నటించే టాలెంట్ అన్ని ఉన్నా..స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు వచ్చినా కానీ ఒక్కటి అంటే ఒక్కటి హిట్ అందుకోలేకపోయింది .

అల్లు అర్జున్, ప్రభాస్, రవితేజ లాంటి స్టార్ హీరోల సినిమాల్లో నటించినా కూడా దీక్ష ఒక్క హిట్ తన ఖాతాలో వేసుకోలేకపోయింది. మిరపకాయ్ సినిమా హిట్ అయిన,..దానిలో అమ్మది పాత్ర ఏం లేదు అని సినిమా చూసిన జనాలందరికి తెలుసు. అలా అందం, టాలెంట్, అవకాశాలు వచ్చినా హీరోయిన్ కి అదృష్టం కలిసిరాకపోవడంతో..ఐరెన్ లెగ్ అనే ముద్ర వేసుకుంది.
అయితే ఆమె లాస్ట్ గా 2016 లో సాత్ కదమ్ అనే హిందీ సినిమాలో నటించింది.

ఇక ఆ తర్వాత సినిమాలకు దూరమైన దీక్ష సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఆమె అభిమానులతో టచ్ లో ఉంటున్నారు. ఈమె సినిమాలకు దూరమవ్వడానికి కారణం ఓ హీరో అన్నట్లు అప్పట్లో వార్తలు బయటకి వచ్చాయి. హీంది ఇండస్ట్రీలో ఓ స్టార్ హీరో తో ప్రేమలో మునిగి తేలిన ఈ బ్యూటీ..కొన్ని రోజుల్లోనే అతగాడికి మరింత దగ్గరైందట.

మరికొన్ని రోజుల్లోనే పెళ్లి అనుకుంటున్న తరుణంలో అతగాడు వేరే అమ్మాయితో రెడ్ హ్యండెడ్ గా దొరకడం..ఆ హీరో దీక్షని అవమానించడం..ఆమె హర్ట్ అయ్యేలా మాట్లాడటంతో..సినీ ఇండస్ట్రీ వాళ్లను నమ్మకూడదు అని ఇండస్ట్రీకి దూరమైన్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. ఆ హీరో కేవలం దీక్ష అందానే ప్రేమించాడు కానీ, మనసుని కాదు అంటూ అప్పట్లో బాలీవుడ్ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి. ప్రజెంట్ దీక్షా టోటల్ మారిపోయింది..అస్సలు గుర్తు పట్టలేరు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news