Moviesనయనతార గురించి మ‌న‌కు తెలియని చీకటి రహస్యాలు...?

నయనతార గురించి మ‌న‌కు తెలియని చీకటి రహస్యాలు…?

సౌత్ ఇండియ‌న్ స్టార్‌ హీరోయిన్ నయనతార గురించి ప్రత్యేకించి పరిచయం అక్కర్లేదు. నయన్ వయసు నాలుగు పదులు దాటుతున్నా ఇప్పటికీ వన్నె తగ్గని అందం తన సొంతం. తన అందం, అభినయంతో తెలుగు, తమిళ రాష్ట్రాలలో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. సినిమా తారలు తమ కెరీర్ లో తెలిసో తెలియకో కొన్ని తప్పులు చేస్తుంటారు. అయితే కొన్ని సార్లు అవి వారికి నష్టాన్ని కలిగించకపోవచ్చు. మరికొన్ని సార్లు దారుణమైన చేదు జ్ఞాపకాలను మిగులుస్తాయి. నయనతార జీవితంలో కూడా ఇలాంటి చేదు ఘటనలు మరియు ఎవ్వరికీ తెలియని రహస్యాలు ఎన్నో ఉన్నాయి.మరి అవేమిటో ఒకసారి చూద్దాం.

– అప్పుడప్పుడే సినిమా కెరీర్ స్టార్ట్ చేసిన నయనతారకు తమిళ డైరెక్టర్ టి రాజేందర్ కొడుకు శింబుతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారి, అది వీరి కెరీర్ ను ప్రమాదంలోకి నెట్టేస్తుందని వీరు ఊహించలేకపోయారు. సడెన్ గా వీళ్లిద్దరికీ సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో ప్రత్యక్షమయ్యాయి. దీంతో సోషల్ మీడియాలో వీరిద్దరి గురించి పెళ్లి కాకుండానే కలిసి బ్రతుకుతున్నార‌న్న వార్తలు ఎక్కువయ్యాయి. దీనితో నయనతార – శింబు విడిపోయారు. అయితే ఈ విషయం నయనతార కెరీర్ పై చాలా ప్రభావాన్ని చూపింది.

– శింబు – న‌య‌న్ ప్రేమ విషయం అప్పుడప్పుడే ప్రజలు మర్చిపోతున్న సమయంలో ప్రముఖ డాన్స్ మాస్టర్ , నటుడు ప్రభుదేవాతో ప్రేమలో పడి, సహజీవనం చేసింది నయనతార. ఈ విషయం పెద్ద రచ్చగా మారింది. అప్పటికే ప్రభుదేవాకు పెళ్లి అయిపోయింది. ఈ విషయం తెలుసుకున్న ప్రభుదేవా భార్య ర‌మ‌ల‌త్ తనను ఎక్కడ కనబడితే అక్కడ టార్చర్ చేయడం మొదలెట్టింది. అంతే కాకుండా మహిళా సంఘాలతో వెళ్లి అడగడం లాంటివి చేసేటప్పటికీ నయనతార భరించలేక ప్రభుదేవా నుండి కూడా విడిపోయింది.

– ఇలా పలు కారణాల చేత తమిళ ఇండస్ట్రీలో న‌య‌న్‌పై బ్లాక్ మార్క్ పడింది. తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే కాబట్టి నయనతారను తమిళ సినిమా వెలేసిందా ? అన్న భావన అప్ప‌ట్లో కలిగింది. ఆ తరువాత మూడు సంవత్సరాలు ఆమె సినిమాలు ఏమీ చేయలేదు.
– కేరళలోనే ఒక దేవాలయంలోకి సల్వార్ సూట్ వేసుకుని వెళ్ళడానికి అక్కడి గుడి పెద్దలు నయనతారను నిరాకరించారు. దీంతో ఆగ్రహానికి గురయిన నయనతార అక్కడి పెద్దలపై వాగ్వాదానికి దిగింది. అయితే ఆ తర్వాత తప్పు తెలుసుకుని వారికి క్షమాపణలు చెప్పుకుంది.

– నయనతార – విజయ్ సేతుపతి హీరో, హీరోయిన్లుగా స్టార్ హీరో ధనుష్ “నేను రౌడీనే” అన్న సినిమా షూటింగ్‌ సమయంలో అనుకున్న బడ్జెట్ కంటే ఎక్కువ అవుతున్న సమయంలో, ధనుష్ తన యొక్క పరిమితిని కోల్పోయి ఇక నేను బడ్జెట్ పెట్టను అని తెగేసి చెప్పేశాడు. ఆ సమయంలో నయనతార మిగిలిన సినిమా షూటింగు తన సొంత డబ్బుతో పూర్తి చేసింది. అప్పట్లో ఇది సెన్సషనల్.
– నయనతార ఒక తమిళ సినిమా చేస్తున్న సమయంలో తమిళ కమెడియన్ ప్రేమ్ గి నయన్ ను ఆంటీ అని పిలిచాడు. దీనితో కోపోద్రిక్తురాలైన నయనతార గట్టిగా వార్నింగ్ ఇచ్చింది. ఇంకోసారి రిపీట్ అయితే బాగోదు అని చెప్పింది. ఇది కూడా అప్పట్లో సంచలనంగా మారింది.

– 2013లో నయనతర – ఆర్య పెళ్లి చేసుకున్న ఫొటోలు ఆన్లైన్ లో ప్రత్యక్షం అయ్యాయి. ఇది చూసిన నెటిజన్లు షాక్ తిన్నారు. తీరా చూస్తే అది “రాజారాణి” సినిమా ప్రమోషన్ కోసం ఆడిన డ్రామా అని చెప్పి నయనతార అందరికి షాక్ ఇచ్చింది.
– న‌య‌న్ గ‌త కొన్నేళ్లుగా సినిమాకు రు. 4 కోట్ల రెమ్యున‌రేష‌న్ తీసుకుంటోంది. ఈ విష‌యంలో ఆమె త‌గ్గ‌నంటే త‌గ్గ‌ను అని ఖ‌రాఖండీగా చెప్ప‌డంతో పాటు ఎంత పెద్ద హీరో అయినా తాను ప్ర‌మోష‌న్ల‌కు రాన‌న్న కండీష‌న్లు పెడుతోంది.
– ఇలా కొన్ని విషయాలు నయనతార కెరీర్ ను ఇబ్బంది పెట్టినా, అన్నింటినీ తట్టుకుని ఒక మహాశక్తిగా తమిళ్, తెలుగు సినిమా ఇండస్ట్రీలలో ఒక పవర్ ఫుల్ లేడీగా దూసుకువెళుతోంది. ప్రస్తుతం తన వ్యక్తిగత జీవితంలో త‌న‌కంటే చిన్నోడు అయిన‌ డైరెక్టర్ విగ్నేష్ శివన్ తో సహజీవనంలో ఉంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news