Moviesవెంకటేష్ బ్లాక్ బస్టర్ ' నువ్వు నాకు నచ్చావ్ ' సినిమా...

వెంకటేష్ బ్లాక్ బస్టర్ ‘ నువ్వు నాకు నచ్చావ్ ‘ సినిమా రిజెక్ట్ చేసిన హీరో ఎవరో తెలుసా…!

విక్టరీ వెంకటేష్ కెరీర్లో ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాలు వచ్చాయి. ఈ సినిమాల్లో కె.విజయభాస్కర్ దర్శకత్వంలో వచ్చిన నువ్వు నాకు నచ్చావ్ సినిమా సూపర్ డూపర్ హిట్. అప్పటికే వెంకటేష్ దేవి పుత్రుడు, ప్రేమతో రా లాంటి ఫ్లాప్ సినిమాలు చేసి కెరీర్ లో కాస్త డాన్ ఫాల్‌లో ఉన్నాడు. అలాంటి టైంలో కె.విజయభాస్కర్ దర్శకత్వంలో వచ్చిన నువ్వు నాకు నచ్చావ్ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ ను కట్టిపడేసింది. 2001 సెప్టెంబర్లో రిలీజ్ అయిన ఈ సినిమాతో దివంగత అందాల తార ఆర్తి అగర్వాల్ హీరోయిన్ గా పరిచయం అయింది.

97 కేంద్రాల్లో 50 రోజులు ఆడిన ఈ సినిమా 57 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది. ఈ సినిమాలో వెంకటేష్ – ఆర్తి అగర్వాల్ మధ్య వచ్చే లవ్ ట్రాక్ తో పాటు ఫ్యామిలీ సెంటిమెంట్, ఆశాషైనీ చిలిపి లవ్ ట్రాక్, వెంకటేష్ – సునీల్ కామెడీ, ఎంఎస్‌. నారాయ‌ణ అల్ల‌రి కామెడీ, కోటి పాటలు.. వీటికి మించి ఈ సినిమాతో హీరోయిన్‌గా పరిచయం అయిన ఆర్తి అగర్వాల్ అందాలు సినిమాను బ్లాక్ బస్టర్ చేశాయి.

విజయ భాస్కర్ తనదైన మార్కు టేకింగ్ తో పాటు… మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ మాటలు కూడా ఈ సినిమాకు హైలెట్ గా నిలిచాయి. ఈ సినిమాలో హీరో పాత్రను వెంకటేష్ తప్ప మరెవరూ చేయలేరు అంతగా ఆ పాత్రలో వెంకీ ఒదిగిపోయాడు. ఈ సినిమా కథను దర్శకుడు విజయభాస్కర్ ముందుగా హీరో తరుణ్ కు వినిపించారట. అప్పటికే తరుణ్ హీరోగా విజయభాస్కర్ నువ్వే కావాలి లాంటి సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ సినిమా తెరకెక్కించి ఉన్నారు. ఉషాకిర‌ణ్ మూవీస్ నిర్మించిన నువ్వే కావాలి ఆ రోజుల్లో సంవ‌త్స‌రం పాటు ఆడింది.

ఆ చనువుతోనే నువ్వు నాకు నచ్చావ్ సినిమాను సైతం విజయభాస్కర్ తరుణ్‌తో చేయాలని కథ చెప్పగా తరుణ్ డేట్లు కుదరలేదు అని రిజెక్ట్ చేశారట. అయితే త్రివిక్రమ్ ఈ కథకు విక్టరీ వెంకటేష్ అయితే బాగా సూట్ అవుతారని చెప్పడంతో విజయ్ భాస్కర్ సురేష్ బాబుకు క‌థ చెప్పి వెంకటేష్‌ను హీరోగా ఫైనల్ చేశారు. హీరోయిన్‌గా కొత్త అమ్మాయిని తీసుకోవాలని అనుకున్నారు.

ఆర్తీ అగర్వాల్ ఫోటో చూసిన విజయ భాస్కర్ ఆమె అమెరికాలో ఉంటుందని తెలుసుకుని సురేష్‌బాబు ద్వారా ఆమెను సంప్రదించి ఆడిషన్స్ చేశారు. అలా ఆర్తి అగర్వాల్‌ను హీరోయిన్‌గా తీసుకున్నారు. ఆ రోజుల్లో మూడు కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా రు. 18 కోట్ల వసూళ్లు రాబట్టింది. ఈ సినిమా వదులుకున్న తరుణ్ ఆ వెంటనే సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్లో నువ్వు లేక నేను లేను సినిమా చేసి హిట్ కొట్టారు. ఈ సినిమాలో కూడా ఆర్తీ అగ‌ర్వాలే హీరోయిన్ కావ‌డం విశేషం.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news