Moviesఆ సినిమా స్టిల్ చూసి ప‌వ‌ర్‌స్టారే నెక్ట్స్ సూప‌ర్‌స్టార్ అన్న ర‌జ‌నీ..!

ఆ సినిమా స్టిల్ చూసి ప‌వ‌ర్‌స్టారే నెక్ట్స్ సూప‌ర్‌స్టార్ అన్న ర‌జ‌నీ..!

సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజనీ కాంత్ నాలుగు దశాబ్దాలుగా సినిమారంగాన్ని శాసిస్తున్నారు. 1970వ దశకం నుంచి ఇప్పటివరకు దాదాపు యాభై సంవత్సరాలుగా సినిమా ప్రపంచం ఎంతో మారింది. సౌత్ సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోలు.. స్టార్ హీరోలు వచ్చారు. ఇంకా చెప్పాలంటే ఒకే ఫ్యామిలీ నుంచి మూడో తరం హీరోలు కూడా వ‌చ్చి స్టార్‌ హీరోలుగా కొనసాగుతున్నారు. ఎంత మంది హీరోలు వచ్చిన సూపర్ స్టార్ రజిని ఇమేజ్‌కు సాటిరాగల హీరోలు ఈ జనరేషన్లో కూడా ఎవరూ లేరు.

తెలుగులోనూ.. తమిళంలోనూ, కన్నడంలోనూ, మలయాళంలోనూ ఎంతో మంది సూపర్ స్టార్‌లు ఉన్నారు. అయితే వీళ్ళందరితో పోలిస్తే తిరుగులేని ఇమేజ్ సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్ సొంతం. ఎంత స్టార్ హీరోగా ఎదిగినా కూడా రజిని అంత ఒదిగి ఉంటారు. అసలు ప్రేక్షకులు వెండితెరపై రజనీకాంత్ స్టైల్ చూస్తే చాలు పిచ్చెక్కిపోతారు. ఆయన సినిమా వస్తుందంటే చాలు సౌత్ ఇండియాలో అన్ని భాషల్లోనూ ఆయ‌న ఫ్యాన్స్ వెర్రెక్కి పోయి ఎదురుచూస్తూ ఉంటారు.

రజనీకాంత్ ఈ వయసులో కూడా కుర్ర హీరోలు… స్టార్ హీరోలకు పోటీ ఇస్తూ వరుసగా సినిమాలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే రజనీకాంత్ – జగపతిబాబు కాంబినేషన్ లో కథానాయకుడు సినిమా వచ్చింది. ఈ సినిమా షూటింగ్ టైంలో పవన్ కళ్యాణ్ జల్సా పోస్టర్ రిలీజ్ అయింది. కథానాయకుడు సినిమాలో నటిస్తున్న సునీల్ ఆ పోస్టర్‌ను రజనీకాంత్‌కు చూపిస్తూ సార్ ఈ సినిమా డైరెక్టర్ నా ఫ్రెండ్ అని చెప్పాడట. వెంటనే రజనీకాంత్ త్రివిక్రమ్ నాకు ఎందుకు తెలియదు.. మంచి డైరెక్టర్ అని చెప్పడంతో పాటు పవన్ కళ్యాణ్ స్టైల్ చూసి టాలీవుడ్ నెక్ట్స్‌ సూపర్‌స్టార్ అని కితాబు ఇచ్చార‌ట.

ఈ విషయాన్ని సునీల్ ఓ ఇంటర్వ్యూ లో చెప్పాడు. ఇప్పటివరకు రజినీకాంత్… పవన్ కళ్యాణ్ నెక్ట్స్ సూపర్ స్టార్ అన్న విషయం ఎవరికీ చెప్పలేదని ఇదే మొదటిసారి అని పొంగిపోయాడు. ఆ తర్వాత రజనీ ని కలిసిన సందర్భంలోనూ సార్ మీకు ఇవన్నీ ముందే ఎలా ? తెలుస్తాయి… నా లైఫ్ ఎలా ఉంటుందో కూడా చెప్పాలని సరదాగా అడిగాడట.

అలా కథానాయకుడు సినిమా షూటింగ్ టైంలో జరిగిన ఆ సంఘటనను సునీల్ గుర్తు చేసుకున్నాడు. ఇక కమెడియన్ గా కెరీర్ స్టార్ట్ చేసి తెలుగులో టాప్ కమెడియన్ అయిన సునీల్ ఈ మధ్యలో హీరోగా చాలా ప్రయత్నాలు చేశాడు. వరుస ఫ్లాపులతో రేసులో వెనకపడ్డ సునీల్ ఆ తర్వాత తిరిగి కమెడియన్‌గా.. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చి స‌క్సెస్‌లు కొట్టారు. ఇక సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప‌ సినిమాల్లో విలన్ క్యారెక్టర్ వేసి అదరగొట్టేశాడు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news