Moviesఫాలో ఫాలో అంటూ బాల‌య్యనే ఫాలో అవుతోన్న చిరు...!

ఫాలో ఫాలో అంటూ బాల‌య్యనే ఫాలో అవుతోన్న చిరు…!

సీనియ‌ర్ హీరోల‌కు హీరోయిన్ల విష‌యంలో చాలా పెద్ద ఇబ్బంది వ‌చ్చి ప‌డింది. చివ‌ర‌కు సీనియ‌ర్ హీరోలు త‌మ కూతురు వ‌య‌స్సు ఉన్న కుర్ర హీరోయిన్ల వెంట ప‌డ‌క త‌ప్ప‌డం లేదు. సీనియ‌ర్ హీరో విక్ట‌రీ వెంక‌టేష్ మిల్కీ బ్యూటీ త‌య‌న్నాను ప‌దే ప‌దే రిపీట్ చేస్తున్నారు. లేక‌పోతే సీనియ‌ర్ హీరోయిన్ మీనాను పెట్టుకుంటున్నాడు. చిరంజీవి, బాల‌య్య‌కు హీరోయిన్‌ను సెట్ చేయ‌డం అంటే ద‌ర్శ‌కుల‌కు ఓ ప‌ట్టాన కుద‌ర‌ట్లేదు. చాలా పెద్ద రిస్క్ చేయాల్సి వ‌స్తోంది. బాల‌య్య కూడా ఎక్కువుగా రిపీటెడ్‌గా రాధికా ఆఫ్టే, శ్రీయా, సోనాల్ చౌహాన్ లాంటి వాళ్ల‌ను రిపీట్ చేస్తూ వ‌చ్చాడు.

ఇక ఇప్పుడు చిరంజీవి వ‌రుస పెట్టి సినిమాలు చేస్తోన్న సినిమాల‌కు హీరోయిన్ల‌ను సెట్ చేయ‌డం క‌ష్టం అయిపోతోంది. ఈ క్ర‌మంలో సైరాలో చేసిన త‌మ‌న్నానే మ‌రోసారి భోళా శంక‌ర్‌లో రిపీట్ చేస్తున్నాడు. సైరాలో న‌య‌న‌తార‌తో చేశాడు. గాడ్ ఫాద‌ర్‌లోనూ ఆమే న‌టిస్తోంది. ఇక బాబీతో చేసే వాల్తేరు వీర‌య్య ( వ‌ర్కింగ్ టైటిల్‌)కు శృతీహాస‌న్‌ను తీసుకుని అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు. త‌మ‌న్నా, శృతీహాస‌న్ ఇద్ద‌రూ కూడా చిరు త‌న‌యుడు చెర్రీ ప‌క్క‌న న‌టించిన వారే. ఆ మాట‌కు వ‌స్తే ఈ ఇద్ద‌రూ అటు ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప‌క్క‌న కూడా న‌టించారు. ఇక చెర్రీ ప‌క్క‌న న‌టించిన కాజ‌ల్‌తో కూడా చిరు న‌టించాడు.

ఇక చిరు రీ ఎంట్రీలో న‌టించిన‌, న‌టిస్తోన్న హీరోయిన్లు బాల‌య్య‌తో చిరు కంటే ముందే ఆడిపాడిన వారే..! న‌య‌న‌తార బాల‌య్య‌తో శ్రీరామ‌రాజ్యం, సింహా, జై సింహా సినిమాలు చేసింది. ఇప్పుడు అదే న‌య‌న‌తార‌తో చిరు న‌టిస్తున్నాడు. ఇక బాల‌య్య -మ‌లినేని గోపీచంద్ సినిమాలో శృతీహాస‌న్ హీరోయిన్‌. ఇప్పుడు బాబీ వాల్తేర్ వీర‌య్య‌లో అదే శృతీని తీసుకున్నారు. ఈ విష‌యాన్ని మ‌హిళ‌ల దినోత్స‌వం సంద‌ర్భంగా అధికారికంగా ప్ర‌క‌టించారు.

ఏదేమైనా మ‌న తెలుగులో హీరోల‌కు హీరోయిన్ల కొర‌త తీవ్రంగా ఉంది. కేవ‌లం సీనియ‌ర్ హీరోయిన్లు అని మాత్ర‌మే కాదు… ప‌వ‌న్‌, మ‌హేష్‌, ఎన్టీఆర్‌, చ‌ర‌ణ్ లాంటి వాళ్లు అంద‌రూ ర‌ష్మిక లేదా పూజా వెంట ప‌డుతున్నారు. దీంతో వాళ్ల రేట్లు కూడా కొండెక్కి కూర్చుంటున్నాయి. ఇక్క‌డ హీరోలు ఎక్కువ‌.. వాళ్లే ఒక్కోసారి ఒకే హీరోయిన్‌ను రెండు సార్లు రిపీట్ చేస్తూ ఉండ‌డంతో హీరోయిన్ల విష‌యంలో తీవ్ర ఇబ్బందులు త‌ప్ప‌డం లేదు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news