Moviesప్ర‌భాస్ - మారుతి.. రెండు టాప్ లేప్ అప్‌డేట్స్‌

ప్ర‌భాస్ – మారుతి.. రెండు టాప్ లేప్ అప్‌డేట్స్‌

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుసపెట్టి పాన్ ఇండియా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. బాహుబ‌లి త‌ర్వాత సాహో, రాధేశ్యామ్‌, స‌లార్‌, ఆదిపురుష్‌, ప్రాజెక్ట్ కే ఇలా అన్నీ భారీ పాన్ ఇండియా సినిమాలే లైన్లో పెడుతున్నాడు. ఇలాంటి టైంలో అంద‌రికి ట్విస్ట్ ఇస్తూ మారుతితో ఓ సినిమా చేసేందుకు ఓకే చెప్పాడు. మారుతి ఎప్పుడూ భారీ బ‌డ్జెట్ సినిమాలు తీయ‌లేదు. అలాంటిది ప్ర‌భాస్‌తో సినిమా అంటే అస‌లు క‌థ ఏంటి ఆ క‌మామిషు ఏంట‌న్న‌ది ఎవ్వ‌రికి అంతు ప‌ట్ట‌డం లేదు. ప్ర‌భాస్ – మారుతి ప్రాజెక్టుపై ఇప్ప‌టికే ర‌క‌ర‌కాలుగా వార్త‌లు వ‌స్తున్నాయి.

మారుతి చెప్పిన స్టోరీ లైన్ ప్ర‌భాస్‌కు బాగా న‌చ్చ‌డంతో వెంట‌నే గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్టు తెలుస్తోంది. ప్ర‌స్తుతం మారుతి ఈ సినిమా స్క్రిఫ్ట్‌పై త‌న టీంతో వ‌ర్క్ చేస్తున్నాడ‌ని ఇండ‌స్ట్రీలో చ‌ర్చ న‌డుస్తోంది. ఈ సినిమా లైన్ ప్రేమకథా చిత్రమ్ హ‌ర్ర‌ర్ థ్రిల్ల‌ర్‌గా ఉంటుంది.. అయితే ఫ్యామిలీ ఎమోష‌న్లు ప్ర‌ధానంగా ఉంటాయ‌ని తెలుస్తోంది. ఈ సినిమా కోసం మారుతి కేవ‌లం 55 – 60 రోజుల కాల్షీట్లు మాత్ర‌మే ఇస్తున్నాడ‌ట‌. ఈ విష‌యాన్ని మారుతికి ఇప్ప‌టికే చెప్పేశాడ‌ని అంటున్నారు.

ఈ సినిమా కోసం ఓ భారీ సెట్ వేసి.. అందులోనే చాలా వ‌ర‌కు షూటింగ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. మ‌రో ట్విస్ట్ ఏంటంటే ఈ స‌మ్మ‌ర్ ఎండింగ్‌లోనే ఈ సినిమా సెట్స్ మీద‌కు వెళుతుంది. ముగ్గురు ముద్దుగుమ్మ‌ల‌తో ప్ర‌భాస్ ఈ సినిమాలో రొమాన్స్ చేస్తాడు. ప్ర‌స్తుతం స‌లార్ – ప్రాజెక్ట్ కె సినిమాలు చేస్తోన్న ప్ర‌భాస్ ఆ రెండు సినిమాల షూటింగ్ ఓ కొలిక్కి తీసుకువ‌చ్చాక మారుతి సినిమా షూటింగ్‌లో జాయిన్ అవుతాడు.

ఈ సినిమా క‌థ అంతా మారుతి స్టైల్లో ఫ‌న్‌, థ్రిల్ల‌ర్‌, హ‌ర్ర‌ర్ ఎలిమెంట్స్‌తో పాటు రొమాన్స్ పాళ్లు కూడా ఎక్కువే ఉంటాయంటున్నారు. ఇప్ప‌టికే రాజా డీల‌క్స్ టైటిల్ ప్ర‌చారంలో ఉండ‌గా.. త్రిబుల్ ఆర్ నిర్మాత డీవీవీ దాన‌య్య‌.. డీవీవీ ఎంట‌ర్టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై భారీ బ‌డ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తార‌ని టాక్ ?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news