Moviesనా 90 ఏళ్ల జీవితంలో చేసిన అతి పెద్దతప్పు అదే.. సంచలనంగా...

నా 90 ఏళ్ల జీవితంలో చేసిన అతి పెద్దతప్పు అదే.. సంచలనంగా మారిన షావుకారు జానకి మాటలు..!!

షావుకారు జానకి.. ఈ ప్రేరు ప్రత్యేక పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈమె గురించి ఎంత చెప్పినా అది తక్కువగానే కనిపిస్తుంది. దాదాపు ఏడు దశాబ్దాలకుపైగా సినీ ఇండస్ట్రీలో నటీస్తూ..నటన పై ఆమెకున్న ఇష్టాని తెలియజేస్తుంది. దక్షిణాదిన మొత్తంగా మూడు భాషల్లో 450కిపైగా సినిమాల్లో నటించిన షావుకారు జానకి..లెజండరీ హీరోలు అయినా ఎన్‌టీఆర్‌, ఏఎన్‌ఆర్‌, శివాజీ గణేశన్‌ వంటి దిగ్గజ నటులతో స్క్రీన్ షేర్ చేసుకుంది. షావుకారు’ సినిమాతో అప్పట్లో భారీ విజయాన్ని సాధించి ఆ సినిమానే ఇంటిపేరుగా మార్చుకొని ఎన్నో సినిమాలని అందించిన షావుకారు జానకి కి కేంద్ర ప్రభుత్వం నుంచి పద్మశ్రీ అవార్డు దక్కింది. 90 ఏళ్ళ వ‌య‌సులో ఈ అవార్డు దక్కడం గమనార్హం.

అలనాటి తారలు జానకి, కృష్ణకుమారి అంటే అప్పట్లో ఓ సెన్సేషన్. వీరిద్దరు తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అంతేకాదు ఎన్నో అవార్డులను సొంతం చేసుకున్నారు. ఇందులో జానకి అక్క, కృష్ణకుమారి చెల్లెలు. ఒకప్పుడు కథానాయికగా వెండితెరను ఏలిన జానకి ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, ఇప్పుడు బామ్మగా నటిస్తున్నారు. తమిళనాడు ప్రభుత్వం సిఫారసు మేరకు షావుకారు జానకి పద్మశ్రీ పురస్కారానికి ఎంపికయ్యారు. 18 ఏళ్ల వయసులో నటిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆమె ఇప్పటికీ ఒకట్రెండు సినిమాల్లో నటిస్తూనే ఉన్నారు. 90 ఏళ్ల ఈ నటి ఇప్పటివరకు నాలుగు వందలకు పైగా చిత్రాల్లో నటించారు.

ఇక ఈ వయస్సులో పద్మశ్రీ అవార్డు రావడం పట్ల ఆమె స్పందిస్తూ ఓ ప్రముఖ చానెల్ కు ఇంటర్వ్యు ఇచ్చారు. ఇందులో ఆమె మాట్లాడుతూ..”పద్మశ్రీ అందుకొవడం చాలా ఆనందంగా ఉంది. ఇప్పటివరకూ అందుకున్న అవార్డులల్లో ఇదే అత్యుత్తమ అవార్డు. చాలా మంది ఎప్పటి నుండొ నాకు పద్మశ్రీ ఇవ్వాలని అంటున్నారు..ఇప్పటికే ఆలస్యమైందని చాలామంది అన్నారు కూడా . నిజమే కావచ్చు.. కానీ.. అత్యుత్తమమైనది ఎప్పుడొచ్చినా గర్వకారణమే కదా. పైగా ఇది మరింత బాధ్యతను పెంచింది అని నేను భావిస్తున్న.

ఇంకా ఆమె సినీ విశేషాలు గురించి చెప్తూ..”షావుకారు సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నాకు దేవదాసు సినిమాలో అక్కినేని నాగేశ్వరరావు పక్కన పార్వతి పాత్ర చేసే అవకాశమొచ్చింది. చాలా ఆనందపడ్డాను ఓ పాటకు రిహార్సల్‌ కూడా చేశారు. కానీ ఓ రోజు సడెన్ గా చిత్రం నుంచి తొలగించారన్న కబురందింది. చాలా బాధపడ్డాను. ఇక నేను ఇప్పటికే బాధపడే విషయ, ఏదైన ఉంది అంటే..అది కలెక్టర్‌ జానకి సినిమా వదులుకోవదమే..అప్పట్లో బిజీ గా ఉంది డేట్లు కుదరక ఆ సినిమాను వదులుకున్న..ఇప్పటికి ఆ విషయంలో బాధపడుతూనే ఉన్నా.. నా కాళ్లలో సత్తువ, తడబాటు లేని వాచకం ఉన్నంత వరకు నటిస్తూనే ఉంటా” అంటూ చెప్పుకొచ్చింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news