Moviesవిజయ్ సేతుపతి పెళ్లి వెనుక ఇంత కథ నడిచిందా..ఇంట్రెస్టింగ్..!!

విజయ్ సేతుపతి పెళ్లి వెనుక ఇంత కథ నడిచిందా..ఇంట్రెస్టింగ్..!!

విజయ్ సేతుపతి..ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ మధ్య కాలంలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు ఇది. తమిళ స్టార్ అయినటువంటి విజయ్ సేతుపతి.. హీరోగా కంటే విలన్ గానే బాగా మెప్పిస్తున్నాడు అని అంటున్నారు అందరు. విలక్షణ పాత్రలకు పెట్టింది పేరు అన్నట్లుగా తెలుగు సినిమాల్లో కీలక పాత్రలు పోషిస్తూ ఆకట్టుకుంటున్నారు. ఇంకా చెప్పాలంటే ఈయన తెర పై కనిపిస్తే ఆ సినిమా హిట్ అవుతుందని నమ్ముతున్నారు దర్శకనిర్మాతలు.

ఉప్పెన సినిమాతో తెలుగు హీరోలను బాగా ఆకట్టుకున్నట్లు సినీ ఇండస్ట్రీలో టాక్. ఈయన కు ఎంత డిమాండ్ ఉందంటే ప్రస్తుతం విజయ్ సేతుపతి సినిమా లో ఉండే విధంగా కొందరు హీరోలు, నిర్మాతలు ప్లాన్ చేసుకుంటున్నారట. కపోతే ప్రస్తుతం టాలీవుడ్ లో మాత్రమే కాకుండా కోలీవుడ్ , మాలీవుడ్, శాండిల్వుడ్, బాలీవుడ్ ఇలా వరుస భాషా చిత్రాలలో నటిస్తూ ఒక సంచలనం సృష్టిస్తున్నాడు. అంతేకాదు ఏకంగా అన్ని భాషలలో కలుపుకొని సుమారు15 సినిమాలలో ఒకేసారి చేస్తూ ఉండడం గమనార్హం. ఇక ఈయన క్రేజ్ , దూకుడు ను చూసి స్టార్ హీరోలు సైతం ఆశ్చర్యపోతున్నారు.

కెరీర్ పరంగా ఫుల్ బిజీగా ఉన్న విజయ్ సేతుపతి పెళ్లి గురించి ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. “నేను దుబాయ్‌లో ఉద్యోగం చేసేవాడిని. ఆ టంలోనే ఓ కామన్ ఫ్రెండ్ ద్వారా పరిచమైంది జెస్సీ. ఆమె తో నా తో పరిచయం నాకు ఎప్పటికి గుర్తుండిపోతుంది. అయితే మేము ఇద్దరము ఒకరినొకరు చూడకుండానే చాటింగ్ చేసుకునేవాళ్లం. అలానే ఫ్రెంద్స్ గా మారాం. అలా అలా ఫ్రెండ్ షిప్ కాస్త లవ్ గా మారింది.

కానీ ఈ విషయం ఇంట్లో చెప్పిన్నప్పుడు ఇద్దరు కుటుంబాలు ఒప్పుకోళేదు. చాలా కాలం వెయిట్ చేసాం. చాలాసార్లు మాట్లాడిన తర్వాత, ఫైనల్ గా పెళ్ళికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు కుటుంబ సభ్యులు”..అని చెప్పుకొచ్చారు ఇక్కడ షాకింగ్ ఏమిట్మటేఅ జెస్సీ, విజయ్ సేతుపతి ఒకరినొకరు డైరెక్ట్ గా చూసుకుంది వారి ఎంగేజ్‌మెంట్‌లోనే అని సేతుపతి తెలిపాడు. తన భార్య సపోర్ట్ వల్లే ఇప్పుడు ఆయన ఈ పోజీషన్ లో ఉన్నాడు అని చెప్పుకొచ్చారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news