Moviesహీరోయిన్ అర్చ‌న ఇంట‌ర్ క్యాస్ట్ మ్యారేజ్ వెన‌క ఇంత స్టోరీ న‌డిచిందా...!

హీరోయిన్ అర్చ‌న ఇంట‌ర్ క్యాస్ట్ మ్యారేజ్ వెన‌క ఇంత స్టోరీ న‌డిచిందా…!

తెలుగులో పలు సినిమాల్లో సైడ్ హీరోయిన్ పాత్రలు చేసి మెప్పించింది ప్రముఖ నటి వేద. ఆ త‌ర్వాత ఆమె అర్చ‌న‌గా మారింది. అర్చ‌న గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అందంతో పాటు అభినయం కూడా ఉన్న ఆమెకు సరైన అవకాశాలు రాక పోవడంతో స్టార్ హీరోయిన్ గా ఎద‌గ‌ లేకపోయింది. ఏడు – ఎనిమిది సంవత్సరాల పాటు ఇండస్ట్రీలో ఉన్నా కూడా ఆమెకు హీరోయిన్ గా సరైన ఛాన్సులు రాలేదనే చెప్పాలి.

ఈ క్రమంలోనే ఆమె తన మనసుకు నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకుని ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తోంది. అర్చన జగదీష్ భ‌క్త‌వ‌త్స‌లం అనే వ్యక్తిని ప్రేమ పెళ్లి చేసుకుంది. జగదీష్ అర్చ‌న‌ కులానికి చెందిన వ్యక్తి కాకపోవడంతో అర్చన తల్లిదండ్రులు ఈ పెళ్లికి ముందుగా ఒప్పుకోలేదట. జగదీష్ ని పెళ్లి చేసుకునేందుకు అర్చన చాలా ఇబ్బంది పడిందట‌.

జగదీష్ మంచిత‌నం గురించి తల్లిదండ్రులకు చెప్పి వారి ఒప్పుకున్నాకే జగదీష్ ను తన భర్తగా స్వీకరించాను అని ఆమె చెప్పుకొచ్చింది. ఇక తాను హీరోయిన్‌గా సక్సెస్ కాకపోవడానికి కథలు నచ్చక… కొన్ని సినిమాలు రిజెక్ట్ చేశానని… సైడ్ హీరోయిన్ గా చేయడం వల్ల కూడా తాను హీరోయిన్‌గా సక్సెస్ కాలేకపోయాను అని అర్చన చెప్పింది.

అయితే తాను న‌టించిన సినిమాల్లో త‌న‌కు వ‌చ్చిన క్యారెక్ట‌ర్ల‌తో మాత్రం తాను ఎంతో సంతృప్తి చెందాన‌ని.. ఇప్ప‌ట‌కీ కూడా ప్రాధాన్యం ఉన్న క్యారెక్ట‌ర్లు వ‌స్తే తాను త‌ప్ప‌కుండా న‌టిస్తాన‌ని చెప్పింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news