Moviesవైర‌ల్ న్యూస్‌: R R R ఎన్టీఆర్‌కు - పులికి మ‌ధ్య...

వైర‌ల్ న్యూస్‌: R R R ఎన్టీఆర్‌కు – పులికి మ‌ధ్య స్టోరీ ఇదే… !

బాహుబలితో దేశ వ్యాప్తంగా క్రేజ్ సొంతం చేసుకున్న దర్శకుడు రాజమౌళి ప్ర‌స్తుతం తెర‌కెక్కిస్తోన్న మూవీ ఆర్ ఆర్ ఆర్‌. టాలీవుడ్‌లోనే ఇద్ద‌రు యంగ్ క్రేజీ హీరోలు అయిన యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ – మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ కాంబినేష‌న్లో తెర‌కెక్కుతోన్న ఈ సినిమా వ‌చ్చే సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 7వ తేదీన థియేట‌ర్ల‌లోకి వ‌స్తోంది. రు. 400 కోట్ల భారీ బ‌డ్జెట్‌తో డీవీవీ ఎంట‌ర్టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై డీవీవీ దాన‌య్య ఈ సినిమాను నిర్మిస్తోన్న సంగ‌తి తెలిసిందే.

ఈ సినిమాలో రామ్‌చ‌ర‌ణ్ స‌ర‌స‌న ఆలీయా భ‌ట్‌, ఎన్టీఆర్ స‌ర‌స‌న ఒలీవియా మోరీస్ న‌టిస్తున్నారు. ఇక వీరితో పాటు బాలీవుడ్ సీనియ‌ర్ హీరో అజ‌య్ దేవ‌గ‌న్‌, శ్రీయ‌, స‌ముద్ర‌ఖ‌ని కూడా న‌టిస్తున్నారు. ఒకే స్క్రీన్‌పై ఎన్టీఆర్‌, రామ్‌చ‌ర‌ణ్ క‌నిపిస్తుండ‌డంతో ఈ సినిమా ఖ‌చ్చితంగా ఎన్నో సంచ‌ల‌నాలు క్రియేట్ చేస్తుంద‌న్న అంచ‌నాలు ఉన్నాయి. ఇక బాహుబ‌లి త‌ర్వాత రాజ‌మౌళి డైరెక్ట్ చేస్తోన్న సినిమా కావ‌డంతో ఇప్ప‌టికే బిజినెస్ స‌ర్కిల్స్‌లో కూడా ఆర్ ఆర్ ఆర్ పై పెద్ద చ‌ర్చ న‌డుస్తోంది.

తాజాగా రిలీజ్ అయిన గ్లింప్స్ ఇప్పుడు సోష‌ల్ మీడియాను ఓ ఊపు ఊపేస్తోంది. ఇక ఎన్టీఆర్‌, పులితో పోరాడుతోన్న పోస్ట‌ర్ గురించి ఓ క‌థ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. ఆ పులి బ్రిటీష్ సైనికుడిపై కూడా దాడి చేస్తుంద‌ట‌. ఆ పులికి – ఎన్టీఆర్‌కు ఉన్న సంబంధ‌మే పెద్ద స‌స్పెన్స్ అంటున్నారు. ఫ‌స్టాఫ్‌లో ఎన్టీఆర్ పులితో ఫైట్ చేసి దానిని లొంగ‌దీసుకుంటాడ‌ట‌.

సెకండాఫ్‌లో ఎన్టీఆర్ బ్రిటీష్ వారిపై పోరాడుతుంటే త‌న య‌జ‌మాని కోసం పులి సైతం బ్రిటీష్ వారితో పోరాటం చేస్తుంద‌ట‌. ఇందుకు సంబంధించిన విజువ‌ల్స్ తాజాగా రిలీజ్ అయిన గ్లింప్స్‌లో కొంచెం చూపించారు. ఇక ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోన్న ఫొటో కూడా దానికి సంబంధించిందే అంటున్నారు. మ‌రి ఈ స్టోరీ ఎంత వ‌ర‌కు నిజ‌మో జ‌న‌వ‌రి 7న తేలిపోనుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news