MoviesR R R త‌ర్వాత తార‌క్ సంచ‌ల‌న నిర్ణ‌యం.. ఇంత గ్యాపా...!

R R R త‌ర్వాత తార‌క్ సంచ‌ల‌న నిర్ణ‌యం.. ఇంత గ్యాపా…!

టాలీవుడ్ యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ ప్ర‌స్తుతం రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న ఆర్ ఆర్ ఆర్ సినిమాలో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా త‌ర్వాత తార‌క్ కొర‌టాల శివ సినిమా చేస్తారు. ఇందుకు సంబంధించి కొర‌టాల క‌థ‌, మాట‌ల ప‌నిలో బిజీగా ఉన్నాడు. ప్ర‌స్తుతం కొర‌టాల చిరంజీవితో చేసిన ఆచార్య కంప్లీట్ చేసుకున్న వెంట‌నే తార‌క్ సినిమా ప‌నుల్లో బిజీ అవుతాడు. ఆర్ ఆర్ షూటింగ్ కంప్లీట్ అయిన వెంట‌నే తార‌క్ కొర‌టాల సినిమా కోసం బిజీ అయిపోతాడ‌నే ఇప్ప‌టి వ‌ర‌కు అంద‌రూ అనుకున్నారు. అయితే తార‌క్ ఓ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్న‌ట్టే క‌న‌ప‌డుతోంది.

ఆర్ ఆర్ త‌ర్వాత రెండు నెల‌ల పాటు చిన్న‌పాటి లాంగ్ గ్యాప్ తార‌క్ తీసుకోబోతున్నాడ‌ట‌. ప్ర‌స్తుతం తెలుగు యంగ్ స్టార్ హీరోలు అంద‌రూ కూడా పాన్ ఇండియా ఇమేజ్ కోసం ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఇప్ప‌టికే ప్ర‌భాస్‌కు పాన్ ఇండియా ఇమేజ్ వ‌చ్చేసింది. బ‌న్నీ పుష్ప‌తో పాన్ ఇండియా ఇమేజ్ కోసం విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేస్తున్నాడు. అయితే ఇప్పుడు ఎన్టీఆర్ కూడా ఆర్ ఆర్ ఆర్ తో పాన్ ఇండియా లెవ‌ల్లో హైలెట్ అయ్యే ప్లాన్‌లో ఉన్నాడు.

ఈ సినిమా రిలీజ్ అయ్యేందుకు ముందే నార్త్‌లో ప‌లు టాప్ టీవీ ఎంట‌ర్టైన్‌మెంట్ ప్రోగ్రామ్స్‌తో పాటు పాపుల‌ర్ టాక్ షోల‌లో ఎన్టీఆర్ పాల్గొనేలా భారీ ఎత్తున ప్లాన్లు చేశారు. తార‌క్‌తో పాటు రామ్‌చ‌ర‌ణ్ సైతం క‌లిసే కొన్ని ప్రోగ్రామ్స్‌ల్లో పాల్గొంటార‌ట‌. ఇందుకోస‌మే ఏకంగా రెండు నెల‌ల టైం కేటాయించార‌ట‌. డిసెంబ‌ర్ నుంచే కొర‌టాల సినిమా సెట్స్‌మీద‌కు వెళ్లాల్సి ఉన్నా.. ఈ ప్ర‌మోష‌న్ల కోస‌మే దాని షూటింగ్‌ను కూడా వాయిదా వేసిన‌ట్టు తెలుస్తోంది.

మ‌ధ్య‌లో ఓ యాడ్ షూటింగ్ నిమిత్తం ముంబై వెళ్లాల్సి ఉన్నా కూడా క్యాన్సిల్ చేసేశాడ‌ట‌. ఏదేమైనా తార‌క్ నార్త్ ఇండియాకు కూడా ఓ రేంజ్‌లో ప‌రిచ‌యం అయ్యేలా ఆర్ ఆర్ ప్ర‌మోష‌న్లు ఉండ‌బోతున్నాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news