Moviesస్టైలిష్ లుక్ లో మాస్ స్టెప్పులతో..ఇరగదీసిన బాలయ్య..!!

స్టైలిష్ లుక్ లో మాస్ స్టెప్పులతో..ఇరగదీసిన బాలయ్య..!!

యువ‌ర‌త్న‌, నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా తెర‌కెక్కుతోన్న సినిమా అఖండ‌. మాస్ సినిమాల‌కు కేరాఫ్ అడ్ర‌స్ అయిన దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన ఈ భారీ బ‌డ్జెట్ సినిమా ఎప్పుడో రిలీజ్ కావాల్సింది కాని కరోనా మహమ్మారి ధాటికి ఆగిపోఫ్యింది. ఇక పరిస్ధితులు కొంత మేర చక్కబడడంతో డిసెంబరు 2 వ తేదీన గ్రాండ్ గా ధియేటర్స్ లో రిలీజ్ కానుంది. యువ‌ర‌త్న నంద‌మూరి బాల‌కృష్ణ సినిమా వ‌చ్చి దాదాపు రెండేళ్లు అవుతోంది.

2019 లో ఆయ‌న త‌న తండ్రి ఎన్టీఆర్ బ‌యోపిక్ ఆధారంగా తెర‌కెక్కిన ఎన్టీఆర్ క‌థా నాయ‌కుడు, ఎన్టీఆర్ మ‌హా నాయ‌కుడు సినిమాల్లో మాత్ర‌మే న‌టించారు. ఇక అదే యేడాది చివ‌ర్లో కేఎస్‌. ర‌వికుమార్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన రూల‌ర్ సినిమాలో కూడా న‌టించాడు. ఈ మూడు సినిమాలు కూడా డిజాస్ట‌ర్ అయ్యాయి. దీంతో బాలకృష్ణ ఆశలు అన్నీ ఈ సినిమా పైనే పెట్టుకున్నారు. బాల‌య్య స‌ర‌స‌న ప్ర‌గ్య జైశ్వాల్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. మిర్యాల ర‌వీందర్ రెడ్డి భారీ బ‌డ్జెట్‌తో ఈ సినిమాను నిర్మించారు.

కాగా ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజ్ అయిన ఫస్ట్ లుక్, పాటలు, టీజర్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఇక తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ ఫోటో నెట్టింట తెగ హల్ చల్ చేస్తుంది. ఆ ఫోటోలో బాల‌కృష్ణ‌, ప్ర‌గ్యాజైశ్వాల్ ఇర‌గ‌దీసే స్టైలిష్ సాంగ్ చేసిన్నట్లు తెలుస్తుంది. ఈ సినిమాలో బాల‌కృష్ణ మాస్ యాంగిల్‌తో పాటు స్టైలిష్ అవ‌తార్‌ను కూడా చూపించ‌బోతున్నాడ‌న్న‌మాట‌. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను న‌వంబ‌ర్ 27న శిల్ప క‌ళావేదిక‌లో గ్రాండ్ గా నిర్వ‌హిస్తున్నారు చిత్ర బృంద. ఈ కార్య‌క్ర‌మానికి ప‌లువురు సెల‌బ్రిటీలు హాజ‌రుకానున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news