Moviesఇప్పటి వరకు నేను చేసిన పనిలో ఇదే బెస్ట్ .. తమన్...

ఇప్పటి వరకు నేను చేసిన పనిలో ఇదే బెస్ట్ .. తమన్ కీలక వ్యాఖ్యలు..!!

యువ‌ర‌త్న‌, నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా తెర‌కెక్కుతోన్న సినిమా అఖండ‌. మాస్ సినిమాల‌కు కేరాఫ్ అడ్ర‌స్ అయిన దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన ఈ భారీ బ‌డ్జెట్ సినిమా పై అభిమానులు భారీ అంచనాలే పెట్టుకుని ఉన్నారు. నందమూరి బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో రాబోతున్న హ్యాట్రిక్ మూవీ అఖండకు సంగీతం అందించాడు సంగీత దర్శకుడు తమన్‌. ఈ మూవీ డిసెంబర్ 2న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుదల కాబోతోంది. ద్వారకా క్రియేషన్స్‌పై అఖండ చిత్రాన్ని మిర్యాల రవిందర్ రెడ్డి నిర్మిస్తున్నారు. అఖండ ప్రమోషన్స్‌లో భాగంగా మ్యూజిక్ డైరక్టర్ తమన్ మీడియాతో ముచ్చటించారు.

తమన్ మాట్లాడుతూ..” ఈ సినిమాలో ఏదో తెలియని ఓ ఫైర్ ఉంది. నిజానికి ఓ సినిమా హిట్ అవ్వాలంటే ఖచ్చితంగా అందులో ఎమోషన్ ఉంటే బాగుంటుంది. ఎమోషన్ బాగుంటే సినిమాలు ఎప్పుడూ హిట్ అవుతాయి అని నేను నమ్ముతాను. ఈ సినిమాలో అవి పుష్కలంగా ఉన్నాయి. ఇక సినిమాలో బాలయ్య గారు డ్యూయల్ రోల్ లో అదరగొట్టేశారు. ఈ సినిమా ఆయన అభిమానులకు పర్ఫెక్ట్ మీల్‌లాంటిది. ఈ సినిమాకి మ్యూజిక్ చేయడానికి నేను అఘోర పాత్రల మీద రీసెర్చ్ కూడా చేశాను. ఆ పాత్రలకు తగ్గట్టుగానే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఉంటుంది. ఈ సినిమా కోసం దాదాపు ఐదారు వందల మంది పని చేశారు. కేవలం సింగర్లే 120 మంది వరకు ఉంటారు. ఇలాంటి జానర్‌లో ఇదే నా బెస్ట్ వర్క్ అవుతుంది. ఇప్పటి వరకు నేను చేసిన పనిలో ఇదే బెస్ట్ ” అంటూ చెప్పుకొచ్చారు.

ఇక ఈ సినిమా శ్రీకాంత్ విల‌న్‌గా న‌టిస్తున్నాడు. అలాగే జ‌గ‌ప‌తిబాబు కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నాడు. ద్వార‌కా క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై మిర్యాల ర‌వీంద‌ర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కాగా ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజ్ అయిన ఫస్ట్ లుక్, పాటలు, టీజర్ అభిమానులను ఎంతగా ఆకట్టుకున్నాయో మనకు తెలిసిందే. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను న‌వంబ‌ర్ 27న శిల్ప క‌ళావేదిక‌లో గ్రాండ్ గా నిర్వ‌హిస్తున్నారు చిత్ర బృంద. ఈ కార్య‌క్ర‌మానికి ప‌లువురు సెల‌బ్రిటీలు హాజ‌రుకానున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news