Moviesవాళ్ల కోసం యాంకర్ సుమ అలా చేస్తే..రాజీవ్ పరిస్ధితి ఏంటబ్బా..?

వాళ్ల కోసం యాంకర్ సుమ అలా చేస్తే..రాజీవ్ పరిస్ధితి ఏంటబ్బా..?

తెలుగు యాంకర్స్ లలో స్టార్ సినిమా నుండి చిన్న సినిమా వరకు ఈవెంట్ ఏదైనా సినిమా ఫంక్షన్ అనగానే అందరికి గుర్తొచ్చే యాంకర్ సుమ. ఎన్నో ఏళ్లుగా ఎవరెవరో వస్తున్నా పోతున్నా సుమ మాత్రం యాంకరింగ్ చేస్తూనే ఉంది.. ఉంటుంది. ఇండస్ట్రీలో సుమ తో పాటు చాలా మంది యాంకర్స్ ఉన్నారు. అయితే దాదాపు అందరు కూడా ఏదో ఒక సందర్భంలో నెగిటివ్ కామెంట్స్ అందుకున్న వారే. కానీ సుమ యాంకరింగ్ చేస్తే మాత్రం అసలు నెగిటివ్ కామెంట్స్ అనేవి కూడా పెద్దగా కనిపించవు. ఆమె చాలా పాజిటివ్ గా ఎలాంటి ఈవెంట్ ను అయినా సరే సక్సెస్ఫుల్ గా కొనసాగిస్తూ ఉంటారు.

ఇప్పుటికే బుల్లితెర‌పై ఏ ప్రోగ్రామ్ వ‌చ్చినా అన్నింట్లోనూ క‌నిపించే సుమ‌కు ఇక్క‌డ ఎంత డిమాండ్ క్రేజ్ ఉందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. స్టేజ్‌పై సుమ ఉందంటే చాలు అక్క‌డ న‌వ్వులు గ్యారెంటీ. ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్ల‌లోనూ ఆమెకు ప్ర‌త్యేక స్థానం ఉంది. టాప్ హీరోలు సైతం ఆమెపై ప్ర‌శంస‌లు కురిపిస్తుంటారు. సుమ‌కు ఉన్న క్రేజ్‌కు ఆమె సినిమాల్లో న‌టించేందుకు ఓకే చెప్పినా బోలెడ‌న్నీ ఛాన్సులు వ‌స్తాయి. కళ్యాణ ప్రాప్తిరస్తు, వర్షం, ఢీ, బాదుషా, స్వయంవరం, గీతాంజలి, రావోయి చందమామ, స్వరాభిషేకం లాంటి సినిమాల్లో సుమ నటించినప్పటికీ యాంక‌ర్ గానే అందరికీ సుప‌రిచితురాలు. ఇన్ని సినిమాల్లో నటించినా సుమకి యాంక‌ర్‌గా వ‌చ్చిన పేరు న‌టిగా మాత్రం రాలేదు. సుమ కూడా సినిమాల్లో నటించడం కంటే యాంక‌రింగ్‌పైనే ఎక్కువ దృష్టి పెట్టి ఆ రంగంలో నెంబ‌ర్ వ‌న్ అయ్యింది. అయితే ఆమెకు సినిమాల్లో న‌టించాల‌న్న ఆస‌క్తి అయితే లేదు అని చాలా సార్లు చెప్పింది.

అయితే లేటెస్ట్ అప్‌డేట్ ప్ర‌కారం సుమ మళ్లి సినిమాలో న‌టించేందుకు రెడీ అవుతోంద‌ట‌. ఈ విషయాని ఆమె స్వయంగా చెప్పడం గమనార్హం. తాజాగా ఓ వీడియో ద్వారా సుమ ఈ విషయాన్ని తన స్టైల్లో చెప్పుకొచ్చారు. చాలా మంది సెలబ్రిటీలు తన గురించి మాట్లాడిన వీడియో క్లిప్స్ కట్ చేసి ఓ వీడియో రెడీ చేసి.. ”ఇంతమంది అడుగుతున్నారంటే చేసేస్తే పోలే” అని సుమ పోస్ట్ చేసారు. మ‌రి ఏ సినిమాతో సుమ ఎంట్రీ ఇవ్వ‌నుంద‌నే తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news