Moviesఒక్క రికార్డు బద్దలు కొట్టలేకపోయిన RRR..ఏదో తేడా కొడుతుందే..?

ఒక్క రికార్డు బద్దలు కొట్టలేకపోయిన RRR..ఏదో తేడా కొడుతుందే..?

సాధారణంగా రాజమౌళి సినిమాలు వస్తున్నాయంటే..ఖచ్చితంగా ఆ సినిమా పాత రికార్డులు బద్దలు కొట్టల్సిందే. ఇప్పతివరకు చూసుకున్న చరిత్ర చెప్పేది అదే. అయితే..ఈసారి మాత్రం దర్శక ధీరుడు రాజమౌళి లెక్క తప్పిన్నట్లు తెలుస్తుంది. రీజన్స్ ఏంటో తెలియట్లేదు కానీ.. రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్ని డైరెక్ట్ చేసిన సినిమా ఆర్ ఆర్ ఆర్.

ఈ స్టార్ డైరెక్ట‌ర్ తెర‌కెక్కించిన RRR మూవీ వ‌చ్చే ఏడాది సంక్రాంతి సంద‌ర్భంగా జ‌న‌వ‌రి 7న విడుద‌ల‌వుతుంది. గోండు వీరుడు కొమురంభీమ్‌గా ఎన్టీఆర్‌, మ‌న్యం వీరుడు అల్లూరి సీతారామ‌రాజుగా రామ్‌చ‌ర‌ణ్ న‌టించారు. ఇద్ద‌రు యోధుల‌కు సంబంధించిన ఫిక్ష‌న‌ల్ క‌థతో 1940 బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిన చిత్రం. నాలుగు వంద‌ల కోట్ల‌కు పై బ‌డ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా కోసం ఎంటైర్ ఇండియ‌న్ సినీ ఇండ‌స్ట్రీ ఆస‌క్తిగా ఎదురుచూస్తుంది. రీసెంట్‌గా విడుద‌లైన గ్లింప్స్ సినిమాపై అంచ‌నాల‌ను ఆకాశానంటేలా చేసింది. కానీ రాజమౌళి ఊహించిన్నట్లు రికార్డ్ లు మాత్రం బద్దలు కొట్టలేకపోయింది.

యస్..ఆర్ ఆర్ ఆర్ ఫస్ట్ గ్లింప్స్ 40 సెకన్ల వీడియోతో రాజమౌళి ట్రెండ్ క్రియేట్ చేస్తాడని అంతా అనుకున్నారు. సీన్ కట్ చేస్తే.. సోషల్ మీడియాలో రికార్డులన్నీ కొల్లగొట్టలేదు సై కదా..కేజీయఫ్ చాప్టర్ 2 టీజర్‌కు దరి దాపుల్లో కూడా లేదు.ఇక వకీల్ సాబ్, వలిమై సినిమాల విషయంలోనూ ఆర్ఆర్ఆర్ వెనకబడింది.

అంతేకాదు రీసెంట్ గా రిలీజ్ చేసిన రాధేశ్యామ్ టీజర్‌ను కూడా దాట లేకపోయింది. రాధేశ్యామ్ 24 గంటల్లో 17 మిలియన్ల వ్యూస్, 991.4క్ లైక్స్ కొల్లగొట్టింది. అదే ఆర్ఆర్ఆర్ గ్లింప్స్ 24 గంటల్లో 12.44మిలియన్ల వ్యూస్, 987.7క్ లైక్స్‌తో సరిపెట్టుకుంది. 24 గంటల్లో ఆర్ఆర్ఆర్ కొల్లగొట్టిన వ్యూస్, లైక్స్ చాలా తక్కువ ఉన్నాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news