Moviesటాప్ లేపుతోన్న అఖండ ప్రి రిలీజ్ బిజినెస్‌...రిలీజ్‌కు ముందే రికార్డులు..!

టాప్ లేపుతోన్న అఖండ ప్రి రిలీజ్ బిజినెస్‌…రిలీజ్‌కు ముందే రికార్డులు..!

యువ‌ర‌త్న నంద‌మూరి బాల‌కృష్ణ – బోయ‌పాటి శ్రీను కాంబినేష‌న్లో వ‌స్తోన్న అఖండ సినిమా రిలీజ్‌కు రెడీ అవుతోంది. బాల‌య్య – బోయపాటిది ఎలాంటి క్రేజీ కాంబినేష‌నో చెప్ప‌క్క‌ర్లేదు. గ‌తంలో వీరి కాంబినేష‌న్లో వ‌చ్చిన సింహా, లెజెండ్ రెండు సినిమాలు సూప‌ర్ హిట్ అయ్యాయి. దీంతో అఖండ ఖ‌చ్చితంగా హ్యాట్రిక్ కొడుతుంద‌ని అంటున్నారు. ఇంకా రిలీజ్ డేట్ అధికారికంగా క‌న్‌ఫార్మ్ కాక‌పోయినా డిసెంబ‌ర్ 2 అంటున్నారు.

ఇక రిలీజ్‌కు ముందే అఖండ రికార్డులు బ్రేక్ చేస్తోంది. ప్రి రిలీజ్ బిజినెస్‌లో టాప్ లేపుతోంది. నైజాం రైట్స్‌ సాయి కొర్రపాటి, ఎన్వీ ప్రసాద్ కలిపి తీసుకున్నార‌ట‌. ఆంధ్రాలో రు. 35 కోట్ల మార్కెట్ జ‌రిగింద‌ని తెలుస్తోంది. దాదాపు అంతే రేషియోలో సీడెడ్ మార్కెట్ జ‌రిగింద‌ని టాక్ ? ఏపీలో రేట్లు త‌గ్గినా కూడా బాల‌య్య అఖండ‌కు టాప్ రేటుకు బిజినెస్ జ‌ర‌గ‌డంతో సినిమాపై ఉన్న క్రేజ్‌కు నిద‌ర్శ‌నంగా నిలుస్తోంది.

ఇక దీపావ‌ళి రోజున ఈ సినిమా రిలీజ్ డేట్ అధికారికంగా ప్ర‌క‌టిస్తార‌ని అంటున్నారు. డిసెంబ‌ర్ 2కే మొగ్గు చూపుతార‌ని అంటున్నారు. ఇక మిరియాల ర‌వీంద‌ర్ రెడ్డి నిర్మించిన ఈ భారీ బ‌డ్జెట్ సినిమాలో ప్ర‌గ్య జైశ్వాల్ హీరోయిన్‌.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news