Moviesగుప్పెడంత మనసు సీరియల్ ధరణి బ్యాక్ గ్రౌండ్ గురించి తెలిస్తే...

గుప్పెడంత మనసు సీరియల్ ధరణి బ్యాక్ గ్రౌండ్ గురించి తెలిస్తే ఆశ్చర్యపోతారు..!!

బుల్లితెర మీద సీరియల్స్ కి గల క్రేజ్ మామూలు రేంజ్ లో లేదు. తెలుగు బుల్లితెరపై సిరియల్స్ ఆడియన్స్ ని బాగానే ఆకట్టుకుంటున్నాయి. అందుకే అన్ని సీరియల్స్ బాగా ఆకట్టుకుంటున్నాయి. ధారావాహికంగా నడుస్తున్నాయి. టీ వీ సీరియల్స్ ఆడియన్స్ బాగా కనెక్ట్ అవ్వడంతో మంచి ఆదరణకు నోచుకుంటున్నాయి. ఇక స్టార్ మా ఛానల్ లో ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ కొద్దికాలంలోనే ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. బుల్లితెరలో ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకులు బాగా ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా ఇందులో నటీనటులు తమ నటనతో,అందంతో అలరిస్తున్నారు. అందుకే మంచి టిఆర్పి రేటింగ్ తో దూసుకెళ్తోంది.

ఇక ఈ సీరియల్ లో వసుంధర్,రిషీ ఇద్దరు ఈ సీరియల్ కి హైలెట్ గా నిలుస్తున్నారు. ముఖ్యంగా వీరిద్దరి మధ్య సాగే బాండింగ్ తెర పై అందరిని బాగా అట్రాక్ట్ చేస్తుంది. ఇక ఈ సీరియల్ లో ధరణి యాక్టింగ్ సూపర్ గా ఉంటుంది.తనఅందంతో.. అమాయకపు నటనతో అభిమానులను బాగా అలరిస్తూ మంచి పేరు గుర్తింపు తెచ్చుకుంటోంది. ఇక ఈమె అసలు పేరు జ్యోతి. ఈమె మన తెలుగు అమ్మాయి కావడం విశేషం. ఇప్పటికే ఎన్నో సీరియల్స్ లో నటిస్తూ తెలుగు ప్రేక్షకులకు మనసులను గెలుచుకుంది.

చిన్నప్పటినుంచి నటన పై ఆసక్తి ఉండడంతో.. పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పనిచేసి.. ఆ తర్వాత సీరియల్స్ లోకి వచ్చి మంచి గుర్తింపు తెచ్చుకుంది. అమెరికా అమ్మాయి , మీనాక్షి వంటి పలు సీరియల్స్ లో నటించి తెలుగు ఆడియెన్స్ కు బాగా దగ్గరైంది. అంతేకాదు 2014వ సంవత్సరంలో ఈమెకు బెస్ట్ యాక్ట్రెస్ అవార్డు కూడా లభించింది. ప్రస్తుతం సీరియల్ లో నటిస్తున్న ఈమె సరైన అవకాశం దొరికితే మళ్ళి సినిమాలో నటించడానికి సిద్ధంగా ఉందట.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news