Moviesఅమ్మ బాబోయ్..ప్రభాస్ కార్ వ్యాన్ స్పెషాలిటీలు తెలిస్తే..ఆశ్చర్యపోవాల్సిందే..!!

అమ్మ బాబోయ్..ప్రభాస్ కార్ వ్యాన్ స్పెషాలిటీలు తెలిస్తే..ఆశ్చర్యపోవాల్సిందే..!!

మన టాలీవుడ్ హీరోలు తమ రేంజ్ ని పెంచుకొని బాలీవుడ్ హీరోల స్థాయికి ధీటుగా..కాదు కాదు ..వాళ్ళను మించిపోయారు. ఒక్కో సినిమాకు కోట్లకు కోట్లకు తగ్గకుండా పారితోషికం తీసుకుంటూ మాకు మేమే ట్రేండ్ సెట్ చేస్తాం అంటున్నారు. ఇక పారితోషకానికి తగ్గటే..వాళ్లు వాడే వస్తువులు కూడా ఉంటున్నాయి. ఇటీవల సినీ ఇండస్ట్రీలో పెద్ద పెద్ద స్టార్ హీరోలు అలాగే కొంతమంది హీరోయిన్లు కూడా తమకంటూ ప్రత్యేకమైన ఓ కార్ వ్యాన్ లను కొనుగోలు చేస్తున్నారు.

సాధారణంగా అయితే షూటింగ్ సమయంలో నిర్మాతలే హీరోలకు ఇలాంటి కాస్ట్ లీ కార్ వ్యాన్లను ఏర్పాటు చేసేవారు. ఆ తర్వాత హీరోలే సొంతంగా కార్ వ్యాన్ లను కొనుగోలు చేసుకుంటున్నారు.వాళ్ళ ఇల్లులు ఎంత విలాసవంతంగా ఉంటాయో.. వాళ్ళ వ్యానిటీ వ్యాన్లను కూడా అంతే విలాసవంతగా ఉండేలా స్పెషల్ గా డిజైన్ చేయించుకుంటూ ఉంటారు.వీరు షూటింగ్ సమయంలో విశ్రాంతి తీసుకోవడానికి షూటింగ్ కోసం రెడీ అవడానికి ఇలాంటి ఎన్నో పనుల కోసం ప్రత్యేకంగా కార్ వ్యాన్ ను హీరోలు, హీరోయిన్లు ఉపయోగించుకుంటూ ఉంటారు. అప్పుడేప్పుడో అల్లు అర్జున్ కోన్న కార్ వ్యాన్ ఎమత్ హాట్ టాపిక్ గా మారిందో మనం చూసాం.

తాజాగా యంగ్ రెబల్ స్టార్ డార్లింగ్ ప్రభాస్ వ్యానిటీ వ్యాన్ గురించి నెట్టింట ఆసక్తికర చర్చ నడుస్తుంది. అందరి హీరోల లాగానే కార్ వ్యాన్ లో అన్ని లగ్జరీ సౌకర్యాలు ఉండేలా దీనిని డిజైన్ చేయించుకొని మరీ కొనుగోలు చేశాడట. అయితే అందరి కార్ వ్యాన్ ల కాకుండా ప్రభాస్ కు ఉన్న కార్ వ్యాన్ కు మాత్రం చాలా ప్రత్యేకత ఉందట. అది ఏమిటంటే..?? ఇంత లగ్జరీగా డిజైన్ చేయించుకున్న కార్ వ్యాన్ లో సహజసిద్దమైన వెలుతురు వచ్చే ఒక సన్ రూఫ్ పీచర్ ఉండడం గమనార్హం. ఈ విషయాన్ని అతనితో ‘ఆదిపురుష్’ మూవీని తెరకెక్కిస్తున్న దర్శకుడు ఓం రౌత్ తన సోషల్ మీడియాలో తెలియజేసాడు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news