Gossipsప్రేమలో పడ్డ పూజా హెగ్డే.. ఎవరితోనో తెలుసా..??

ప్రేమలో పడ్డ పూజా హెగ్డే.. ఎవరితోనో తెలుసా..??

పూజా హెగ్డే.. టాలివుడ్ బుట్టబోమ్మ. 2014 లో ముకుంద అనే సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ఈ భామ.. కెరీర్ మొదట్లో ఒక్క హిట్ కొట్టడానికి చాలా టైం తీసుకుంది. కానీ ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో ప్రస్తుతం నెంబర్ వన్ హీరోయిన్ ఎవరంటే పూజా హెగ్డే అని మరో అనుమానం లేకుండా చెప్తున్నారు. కన్నడ భామ పూజా హెగ్డే అన్ని భాషల కంటే తెలుగులోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ అమ్మడు ఇప్పుడు వరుస సినిమాలతో టాలీవుడ్ ను షేక్ చేస్తుంది. కెరీర్ తొలినాళ్లలో వరుస ఫ్లాపులతో సతమతమైనా ఆ తర్వాత గేర్ మార్చింది.

హిట్లు ఫ్లాపులతో సంబంధం లేకుండా స్టార్ హీరోల సరసన అవకాశాలు దక్కించుకుంటూ దూసుకుపోతుంది ఈ చిన్నది. తన అందచందాలతో ప్రేక్షకులను మైమరిపిస్తూ ఇప్పుడు టాప్‌ హీరోయిన్‌గా ఎదిగింది. ఇప్పుడు పూజా హెగ్డే తెలుగులో ఫుల్ బిజీగా ఉన్నారు. ఆల్రెడీ ఆచార్య, మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్‌లర్, రాధేశ్యామ్ సినిమాలతో ప్రేక్షకులను పలకరించేందుకు రెడీగా ఉన్నారు. ఇక సల్మాన్ ఖాన్, దళపతి విజయ్ చిత్రాల్లోనూ హీరోయిన్‌గా ఎంపికయ్యారు. అల వైకుంఠపురములో లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత ఈమె రేంజ్ మరింత పెరిగిపోయిందనే చెప్పాలి.

ఇది ఇలా ఉండగా..వరుస సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా పూజాహెగ్డే ఓ బాలీవుడ్ నటుడితో పీకల్లోతు ప్రేమలో ఉందని టాక్. అతనితో కలిసి డేటింగ్ కూడా చేస్తుందట ఈ బుట్టబోమ్మ. అంతేకాదు వీరిద్దరూ చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూ ఎన్నో సార్లు మీడియా కంత కూడా పడ్డారట. మరి ఈ బుట్ట బొమ్మ ప్రేమలో పడింది బాలీవుడ్ స్టార్ హీరో వినోద్ మెహ్రా కుమారుడు రోహన్ తో పూజా హెగ్డే ప్రేమలో పడినట్లు పెద్ద ఎత్తున వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విధంగా సోషల్ మీడియాలో వీరిద్దరూ ప్రేమించుకుంటున్నారని,వీరిద్దరూ డేటింగ్ చేస్తున్నారని పెద్ద ఎత్తున వార్తలు వినిపిస్తున్నప్పటికీ ఈ విషయంపై సదరు నటీనటులు స్పందించకపోవడంతో వీరి పై వస్తున్న వార్తలకు మరింత బలం చేకూరుతోంది. చూడాలి మరి వీళ్ల ప్రేమ పెళ్లి వరకు వెళుతుందో ..లేదా సోషల్ మీడియా వరకే పరిమితం అవుతుందో..??

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news