Moviesఅలా చేయడం ఓ నేరం..ఆమాత్రం తెలియదా ఈ మెగా వారసుడికి.. రామ్...

అలా చేయడం ఓ నేరం..ఆమాత్రం తెలియదా ఈ మెగా వారసుడికి.. రామ్ చరణ్ ని తిట్టిపోస్తున్న నెటిజన్స్..?

అప్పుడేప్పుడొ బోయపాటి శ్రీను దర్శకత్వంలో వినయ విధేయ రామ సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రామ్ చరణ్.. ఆ సినిమా తో భారీ డిజాస్టర్ అందుకున్నాడు. ఆ సినిమా పూర్తి అయిన వెంటనే చాలా గ్యాప్ తీసుకుని తర్వాత రాజమౌళి దర్శకత్వంలో ప్రస్తుతం ఆర్ ఆర్ ఆర్ అనే సినిమా చేస్తున్నాడు. రామ్ చరణ్.. ప్రస్తుతం రాజమౌళి “RRR” చిత్ర షూటింగ్ లో బిజీ బిజీ గా ఉన్న సంగతి తెలిసిందే.

ఓ వైపు సినిమాలతో బిజీ బిజీగా ఉంటున్న రామ్ చరణ్, మరోవైపు యాడ్ షూట్స్ చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే హ్యాపీ మొబైల్స్‌కు మెగా పవర్ స్టార్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉంటూ ఆ మొబైల్స్‌కు సంబంధించిన ప్రచార బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అయితే అసలు మ్యాటర్ ఏమిటంటే.. ఆ సంస్థ భారత స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఫుల్ పేజీ యాడ్ లు కొన్ని పేపర్లకి ఇచ్చింది.

ఈ ఫుల్ పేజీ యాడ్ లో భాగంగా రామ్ చరణ్ పూర్తిగా తెల్లటి దుస్తుల్లో కనిపిస్తూ జాతీయ జెండా ఎగర వేస్తున్నట్లుగా ఫోటో ఒకటి వచ్చింది. ఇంత వరకు బాగానే ఉంది. అయితే ఇందులో రామ్ చరణ్ జాతీయ జెండా పట్టుకొని సాంప్రదాయ దుస్తుల్లో కనిపిస్తున్నప్పటీకీ.. ఆ జాతీయ జెండాలో అశోక చక్రం లేకపోవడం అందరి కంట పడింది. ఇంకేముంది.. మెగాస్టార్ కొడు కు రామ్ చరణ్ తేజ్ జాతీయ జెండాను అవమానించాడు అంటూ వార్తలు సోషల్ మీడియాలో మారుమ్రోగిపోతున్నాయి.

2002 జాతీయ జెండా చట్టం ప్రకారం ఇలా అశోక చక్రం లేకుండా జెండా ప్రదర్శించడం అనేది ఓ నేరం. దీంతో ఈ ఇష్యూ సోషల్ మీడియాలో పెద్ద హత్ టాపిక్ గా నిలిచింది. దీంతో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ జాతీయ జెండాను అవమానించారు అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం మొదలైంది.

 

అంత పెద్ద కుటుంబం నుండి వచ్చాడు ఆ మాత్రం తెలియదా..అని కొందరు కామెంట్స్ పెడుతుంటే.. మరోపక్క మెగా అభిమానులు మాత్ర, ఆయన ఉద్దేశం పూర్వకంగా అలా చెయ్యలేదు అంటూ సపోర్ట్ చేస్తున్నారు. ఇక దీనిపై సదరు యాడ్ ఇచ్చిన కంపెనీ వారు వివరణ ఇస్తూ ఇలా అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చుకునేటప్పుడు జాతీయ జెండాను పోలి ఉండేలా త్రివర్ణ పతాకాన్ని మాత్రమే వాడాలని, అందుకే ఇలా చేశామని క్లారిటీ ఇచ్చారు. అయినా కానీ చరణ్ మీద ట్రోల్స్ ఆగడంలేదు. చూడలి మరీ ఈ ఇష్యూ ఎప్పుడు ఎండ్ అవుతుందో..??

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news