Gossipsటాలీవుడ్ కింగ్ నాగార్జునకి ఆ హీరోయిన్ అంటే వణుకు.. ఎందుకో తెలుసా..??

టాలీవుడ్ కింగ్ నాగార్జునకి ఆ హీరోయిన్ అంటే వణుకు.. ఎందుకో తెలుసా..??

టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలలో అక్కినేని నాగార్జున కూడా ఒకరు. టాలీవుడ్ లో లెజెండ్ హీరో అక్కినేని నాగేశ్వరరావు తనయుడు గా వెండితెరకు పరిచయమైన నాగార్జున తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో ఒక శివ గా.. ఒక కింగ్ గా.. ఒక మన్మధుడు గా… ఒక అన్నమయ్య గా ఇలా ఎన్నో పాత్రలతో చెక్కుచెదరని స్థానం సంపాదించుకున్నారు. నాగార్జున వ్యక్తిగత విషయాలకు వెళ్తే.. ఆయన అక్కినేని నాగేశ్వర్ రావు, అన్నపూర్ణ దంపతులకు ఆగష్టు 29, 1959న చెన్నైలో జన్మించారు. ఇక నాగార్జున హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌లో ప్రాథమిక విద్యను, లిటిల్ ప్లవర్ స్కూల్‌లో ఇంటెర్మీడియట్ పూర్తి చేశారు.

విక్రమ్ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన నాగార్జున. మొదటి సినిమాతోనే మంచి విజయం అందుకున్నారు. అంతేకాదు.. నాగార్జున తన తండ్రి నాగేశ్వర్ రావుతో కలిసి పలు సినిమాలో నటించారు. ఇప్పుడు నాగార్జున తన కొడుకుతో కలిసి నటిస్తున్నాడు. ఇంత వయసు వచ్చినా కూడా నాగారజున అందం ఏమాత్రం చెక్కు చెదరలేదు. మనవళ్ళు-మనవరాళ్లు వచ్చే వయసు ఉన్నా కూడా ఇండస్ట్రీలో ఇప్పటికి మన్మధుడిగా రాణిస్తున్నారు టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున.

అయితే నాగార్జున సినిమా రంగంలో తిరుగులేని హీరోగా ఉన్నప్పటికి అప్పట్లో ఓ హీరోయిన్ తో నటించాలంటే చాలా భయపడేవారట. ఆమె ఎవరో తెలుసా..??..అతిలోక సుందరొ “శ్రీదేవి”. ఆల్ ఇండియా స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందిన శ్రీదేవి నాగ్ తో ఆఖరి పోరాటం అనే సినిమా తీసుతున్నప్పుడు.. ఆయన చాలా భయపడ్డారట. కానీ షూటింగ్ మొదలై కొన్ని సిన్న్స్ చేసాక ఆ భయం పోయిందట. అయితే అదే శ్రీదేవితో గోవింద గోవింద సినిమా చేసినప్పుడు.. ఆయన అలా భయపడలేదట.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news