Moviesకొత్త అవతారమెత్తిన మంగ్లీ.. అలాంటి పాత్రతో వెండి తెర పై గ్రాండ్...

కొత్త అవతారమెత్తిన మంగ్లీ.. అలాంటి పాత్రతో వెండి తెర పై గ్రాండ్ ఎంట్రీ..?

తెలుగులో సినీ రంగంలోనే కాకుండా.. యూ ట్యూబ్ లోనూ, ఇటు బుల్లితెర మీద ఫోక్ సింగ‌ర్‌గా మంగ్లీ చేసిన సంచ‌ల‌నాలు అన్నీ ఇన్నీ కావు. మంగ్లీ ఏ సాంగ్ పాడినా కూడా యూ ట్యూబ్‌లో మిలియ‌న్ల కొద్దీ వ్యూస్ వ‌స్తుంటాయి. ఏ సాంగ్‌కు అయినా త‌క్కువ స‌మ‌యంలోనే ఎక్కువ వ్యూస్ రావ‌డంతో పాటు వ‌చ్చే పాపులార్టీ మామూలుగా ఉండ‌దు. ఇటు బుల్లితెర మీద మంగ్లీ పాల్గొన్న‌, చేసిన ప్రోగ్రామ్స్‌కు అయినా తిరుగులేని క్రేజ్ ఉంటుంది. ఈ క్ర‌మంలోనే మంగ్లీ ఇప్పుడు వెండితెర మీద కూడా త‌న అదృష్టాన్ని ప‌రీక్షించుకోబోతున్న‌ట్టు తెలుస్తోంది.

మంగ్లీ ఇటీవ‌ల సోష‌ల్ మీడియాలో మోడ్ర‌స్ దుస్తుల‌తో దుమ్ము లేపుతోంది. ఆమె కూడా కాస్త హాటీ దుస్తుల‌తో కుర్ర కారును క‌వ్విస్తోంది. మంగ్లీ అంటేనే ట్రెడిష‌న‌ల్ లుక్‌కు మారుపేరు. అలాంటిది ఆమె ఇప్పుడు ఇంత మోడ్ర‌న్‌గా క‌నిపిస్తుండ‌డంతో అంద‌రూ షాక్ అవుతున్నారు. ఇలా సింగర్ గా మంచి జోష్ లో ఉన్న మంగ్లీ ఒక సినిమాలో ఒక ముఖ్య పాత్రను పోషించిందట. ఆ చిత్రం మరికొన్ని రోజుల్లో విడుదలకు సిద్ధంగా ఉంది.

‘అంధాదున్’ సినిమాకు రీమేక్ గా తెరకెక్కిన నితిన్ హీరోగా నటించిన ‘మాస్ట్రో’ సినిమా మరికొద్ది రోజుల్లో ప్రముఖ ‘ఓటిటి’ అయిన ‘హార్ట్ స్టార్’ లో విడుదలకు సిద్ధంగా ఉన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమాలో హీరో నితిన్ ను మోసం చేస్తే పాత్రలో మంగ్లీ మనకు కనిపించబోతుందట. మరి ఈ పాత్రతో మంగ్లీ జనాలను ఎంత ఆకట్టుకుంటుందో తెలియాలంటే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే వరకు ఆగాల్సిందే.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news