Moviesపుష్ప సినిమా నుండి మరో క్రేజీ అప్‌డేట్..బొమ్మ దద్దరిల్లాల్సిందే..!!

పుష్ప సినిమా నుండి మరో క్రేజీ అప్‌డేట్..బొమ్మ దద్దరిల్లాల్సిందే..!!

గ‌త బ్లాక్ బ‌స్ట‌ర్ అల వైకుంఠపురంలో త‌ర్వాత ప్ర‌స్తుతం సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో పుష్ప సినిమా చేస్తున్నాడు. ఇటు సుక్కు కూడా రంగ‌స్థ‌లం లాంటి యునాన‌మ‌స్ బ్లాక్ బ‌స్ట‌ర్ త‌ర్వాత చాలా లాంగ్ గ్యాప్ తీసుకుని పుష్ప మీదే వ‌ర్క్ చేస్తున్నాడు. ఎవ్వ‌రూ ఊహించ‌ని విధంగా పుష్ప‌లో ర‌ష్మీక గిరిజ‌న అమ్మాయిగా క‌నిపిస్తుండ‌గా… బ‌న్నీ కూడా ఆమెను ప్రేమించే గిరిజ‌న యువ‌కుడి గా క‌నిపించ‌బోతున్నాడ‌ట‌. అందుకే ఆ చిత్తూరు యాస‌ను చాలా క‌ష్ట‌ప‌డి మ‌రీ నేర్చుకున్నాడ‌ని తెలుస్తోంది. త‌మిళ‌నాడు, చిత్తూరు స‌రిహ‌ద్దుల్లోని ఓ గిరిజ‌న గ్రామానికి సంబంధించిన క‌థాంశంతో ఈ సినిమా తెర‌కెక్కుతోంది.

రష్మిక మంద‌న్న‌ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాలో ఫహద్ ఫాజిల్ విలన్ గా కనిపించనున్నారు. ఈ సినిమా విడుదలకు ముందే టీజర్,సాంగ్ ఇంకా పోస్టర్ లతో పాన్ ఇండియా రేంజ్ లో పెద్ద హైప్ క్రియేట్ చేసి దూసుకు పోతుంది. ఇక అల్లు అర్జున్ పుష్ప సినిమా నుంచి బయటకు వచ్చిన ఫస్ట్ సింగిల్ దాక్కో దాక్కో మేక పాట నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. అలా దాక్కో దాక్కో మేక అనే పాట ఇప్పుడు యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతోంది.

ఇక పుష్ప గురించి వ‌స్తోన్న వార్త‌లు ఎగ్జైట్మెంట్ పెంచేస్తున్నాయి. తాజాగా ఈ సినిమా గురించి గురించి ఫ్యీజులు ఎగిరిపోయే అప్ డేట్ ఒక‌టి బ‌య‌ట‌కు వ‌చ్చింది. తాజాగా ఈ సినిమా నుంచి మరో అప్‌డేట్ విడుదల అయింది.

ఈ సినిమాలో ‘జాలి రెడ్డి’ అనే పాత్రలో నటిస్తున్న ప్రముఖ కన్నడ నటుడు ధనుంజయ్ పోస్టర్‌ని ఆయన పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసింది చిత్ర యూనిట్. అయితే ధనుంజయ్‌ది ఈ సినిమాలో నెగటివ్ రోలా.. లేక పాజిటివ్ రోలా అనే విషయంలో క్లారిటీ లేదు.

 

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news