Moviesనాగార్జున-అమల లవ్ స్టోరి..మొదటగా ప్రపోజ్ చేసింది ఎవరో చెప్పుకోండి చూద్దాం..అసలు ఊహించలేరు..!!

నాగార్జున-అమల లవ్ స్టోరి..మొదటగా ప్రపోజ్ చేసింది ఎవరో చెప్పుకోండి చూద్దాం..అసలు ఊహించలేరు..!!

అక్కినేని అమల గురించి తెలియని తెలుగు ప్రేక్షకులు వారు ఉండరు. అమల అక్కినేని, టాలీవుడ్ కింగ్ నాగార్జున మనసు దోచుకున్న అందాల భామ. టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగి కోట్లాదిమంది ప్రేక్షకాభిమానాన్ని సంపాదించుకున్న హీరోయిన్ లలో ఒకరు అమల. హలో గురు ప్రేమకోసమేరో జీవితం అనే పాటలో ఆమె చూపించిన అందం అభిమానయం ఇప్పటికి చాలామంది ఫేవరేట్ అనే చెప్పాలి. అమల అక్కినేని జన్మస్థలం కోల్‌కతా. 1968, సెప్టెంబర్ 12న జన్మించారు.

అమల వాళ్ళ తండ్రి ముఖర్జీ ఓ బెంగాలీ.కలకత్తాకు చెందిన వ్యక్తి. ఇతను నేవీ ఆఫీసర్ గా పనిచేసాడు. ఇక తల్లి విషయానికి వస్తే ఐర్లాండ్ దేశానికి చెందిన మహిళ. అమల తండ్రి ముఖర్జీది ప్రేమ వివాహం. ఆ తర్వాత ముఖర్జీ ఖరగ్పూర్ లో ప్రొఫెసర్ గా కూడా పనిచేసారు.

అమల తల్లి హాస్పిటల్ మేనేజ్మెంట్ జాబ్ చేసేది. అమల తల్లిదండ్రులు వైజాగ్, చెన్నై వంటి ఊర్లలో కూడా కొన్నాళ్ల పాటు జీవనం కొనసాగించారు.

టి. రాజేందర్ దర్శకత్వం వహించిన మిథిలి ఎన్నై కాథాలి అనే సినిమాతో సినీ ఇండస్ట్రీ లో అడుగు పెట్టింది, ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బారి విజయాన్ని సాధించింది. ఒక రాత్రి లోనే ఫేమస్ అయిపోయింది సినీ ప్రేక్షకులను 50 చిత్రాలతో విపరీతంగా అక్కటుకున్నారు ఇందులో అనేక తమిళ బ్లాక్ బస్టర్ సినిమాలు కూడా ఉన్నాయ్.

తెలుగులో కిరాయి దాదా సినిమాతో హీరోయిన్ గా పరిచయమై ఆ తర్వాత చినబాబు, రక్త తిలకం, శివ, ప్రేమయుద్ధం, రాజా విక్రమార్క, అగ్గిరాముడు, నిర్ణయం, ఆగ్రహం వంటి సినిమాల ద్వారా ప్రేక్షకాభిమానాన్ని పొందింది. తెలుగులోనే కాకుండా తమిళం మలయాళం కన్నడ హిందీ భాషలలో కూడా ఆమె ఆమె హీరోయిన్ గా నటించి సౌత్ లో టాప్ హీరోయిన్ గా ఎదిగింది. అమల మొత్తం 54 సినిమాల్లో నటించారు.

అప్పుడప్పుడే తెలుగు చిత్రాల్లో అవకాశాలు దక్కించుకుంటున్న అమలని అక్కినేని వారసుడు నాగార్జున అభిమానించారు. ‘నిర్ణయం’ సినిమాలో వీరిద్దరి లవ్ ట్రాక్‌కి నిదర్శనమా అన్నట్లు.. ‘హలో గురూ ప్రేమ కోసమేరోయ్ జీవితం… ప్రేమించాను దీన్నే… కాదంటోంది నన్నే..’ అన్న పాట అప్పట్లో అభిమానుల్ని ఎంతగానో ఆకట్టుకుంది.

‘గొప్ప ఇంటి కుర్రవాణ్ణి….అక్కినేని అంతటోన్ని… కోరి నిన్ను కోరుకుంటే పెద్ద నేరమా?’ అంటూ సినిమాలోనే నాగార్జున ప్రపోజ్ చేశారు. నాగార్జున.. అమలకి మొదటగా ప్రపోజ్ చేశారు. ‘నిర్ణయం’ సినిమా తరువాత నాగ్ ప్రేమిస్తునానని చెప్పడం ఎంతో ఆశ్చర్యం కలిగించిందని అమల ఓ సందర్భంలో తెలిపారు. తామిద్దరం పరిణతి చెందిన వారం కాబట్టి తమ పెళ్లికి ఎటువంటి ఆటంకాలు ఎదురుకాలేదని చెప్పారు. అక్కినేని నాగార్జున, అమల వివాహం 1992లో జరిగింది.

నాగార్జున ని పెళ్లి చేసుకున్న తరువాత సినిమా పరిశ్రమకి పూర్తిగా దూరం అయ్యారు అమల బ్లూ క్రాస్ అనే ఒక జంతువుల పరిరక్షణ కేంద్రాన్ని స్థాపించి తనకి అనిమల్స్ మీద ఉన్న ప్రేమను చాటుకున్నారు 1986 సంవత్సరంలో సినీ ప్రేక్షకులకు పరిచయం అయ్యింది అక్కినేని అమల.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news