Moviesఆ హీరోయిన్ మూడు పెళ్లిళ్ల వెన‌క క‌థ ఇంత ఉందా..!

ఆ హీరోయిన్ మూడు పెళ్లిళ్ల వెన‌క క‌థ ఇంత ఉందా..!

సీనియ‌ర్ హీరోయిన్ రాధిక సౌత్‌లో అన్ని భాష‌ల ప్రేక్ష‌కుల‌కు బాగా తెలుసు. 1980వ ద‌శకంలో మెగాస్టార్ చిరంజీవితో పోటీప‌డి మ‌రీ ఆమె డ్యాన్సులు వేసేది. తెలుగులో మాత్ర‌మే కాకుండా త‌మిళ్‌లో కూడా రాధిక ఎన్నో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్లు కొట్టింది. కెరీర్ ప‌రంగా ఆమె తిరుగులేని స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్నా ఆమె వ్య‌క్తిగ‌త‌, వైవాహిక జీవితం మాత్రం అనేక ఆటుపోట్ల‌కు గురైంది. ఆమె ఏకంగా మూడు పెళ్లిళ్లు చేసుకుంది. ఆమె హీరోయిన్‌గా పీక్ స్టేజ్‌లో ఉన్న‌ప్పుడే ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు ప్ర‌తాప్ పోత‌న్‌ను 1985లో పెళ్లి చేసుకుంది.



పెళ్ల‌యిన కొద్ది రోజుల‌కే వీరి మ‌ధ్య మ‌న‌స్ప‌ర్థ‌లు రావ‌డంతో విడిపోయారు. ఆ త‌ర్వాత ఓ బ్రిటీష్ వ్య‌క్తిని పెళ్లి చేసుకున్న ఆమె లండ‌న్‌లో అత‌డితో పాటు కొద్ది రోజులు క‌లిసి ఉంది. వీరికి ఓ కుమార్తె పుట్టాక అత‌డు రాధిక‌ను తీవ్రంగా హింసించ‌డంతో ఆమె అత‌డి నుంచి కూడా విడిపోయింది. ఈ రెండు పెళ్లిళ్ల‌తో ఆమె జీవితం పూన‌పాన్పు నుంచి ముళ్ల పాన్పు మీద‌కు వ‌చ్చేసింది. ఆ స‌మ‌యంలో ఆమె ప‌డిన బాధ‌లు, ఆవేద‌న అంతా ఇంతా కాద‌ట‌.

 

 



ఎన్నో విమ‌ర్శ‌లు ఆమె జీవితంపై రావ‌డంతో ఆమె ఎంతో మాన‌సికంగా కుంగిపోయారు. ఆ త‌ర్వాత ఆమె అతి త‌క్కువ పెట్టుబ‌డితో రాడాన్ సంస్థ స్తాపించి వ‌రుస‌గా సీరియ‌ల్స్ నిర్మిస్తున్నారు. ఇప్పుడు ఈ సంస్థ వందల కోట్ల రూపాయ‌ల ట‌ర్నోవ‌ర్ క‌లిగి ఉంది. ఆ త‌ర్వాత ఆమె శ‌ర‌త్‌కుమార్‌ను మూడో పెళ్లి చేసుకున్నారు. శ‌ర‌త్‌కుమార్‌కు కూడా ఇది రెండో పెళ్లి. అలా రాధిక జీవితంలో మూడు పెళ్లిళ్లు జ‌రిగాయి. ఇప్పుడు ఆమె లైఫ్ ఎంతో హ్యాపీగా ఉంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news