Moviesచెల్లిలి కాపురం ' పౌర్ణ‌మి ' ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఇదే

చెల్లిలి కాపురం ‘ పౌర్ణ‌మి ‘ ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఇదే

మాటీవీ లో ప్రసారం అవుతున్న సీరియల్స్ లో కార్తీకదీపం, చెల్లెలి కాపురం సీరియల్స్‌ మంచి ప్రేక్షకాదరణతో దూసుకుపోతున్నాయి. కార్తీకదీపంలో వంట‌ల‌క్క ఎంత పాపులర్ అయిందో చెల్లెలి కాపురం సీరియల్ నటి పౌర్ణమి సైతం తన అందం… అభినయంతో ప్రేక్షకుల మనసును దోచి వేసింది. ఆమె అంతకు ముందు నేను నా ఫ్రెండ్స్ అని సినిమాలో కూడా నటించింది. ఆమె వ్యక్తిగత విషయానికివస్తే తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో జన్మించిన ఈ పౌర్ణమి అసలు పేరు జయ హారిక.

 

తండ్రి ఉద్యోగ రీత్యా పంజాబ్ వెళ్లడంతో అక్కడే ఐదో తరగతి వరకు చదువుకున్న ఆమె… ఆ తర్వాత కుటుంబం కాకినాడ తిరిగి రావడంతో అక్కడ ఎనిమిదవ తరగతి వరకు చదివింది. చివరకు ఆమె తండ్రికి హాంకాంగ్ బ‌దిలీ అవ్వ‌డంతో ఆమె అన్న‌తో పాటు హైద‌రాబాద్ జంప్ చేసింది. ఆమె త‌ల్లి అభిరుచి మేర‌కు కూచిపూడి, భ‌ర‌త‌నాట్యం కంప్లీట్ చేసిన జ‌య‌హారిక బీటెక్ కంప్లీట్ చేసింది.

 

17 సంవ‌త్సారాల‌కే బుల్లితెర ఎంట్రీ ఇచ్చిన ఆమె పుసుపు కుంకుమ‌, మేఘ‌మాల‌, వ‌రూనిధి ప‌రిచ‌యం, శ్రావ‌ణ స‌మీరాలు, రుతుగీతం, అత్త‌మొగుడు, నేను శైల‌జ వంటి సీరియ‌ల్స్‌లో న‌టించింది. ఆమెకు పానీపూరి, చికెన్ అంటే చాలా ఇష్టం.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news