Gossipsసందీప్‌కిష‌న్ సీక్రెట్ ప్రేమ‌... కాబోయే భార్య ఎవ‌రంటే...!

సందీప్‌కిష‌న్ సీక్రెట్ ప్రేమ‌… కాబోయే భార్య ఎవ‌రంటే…!

టాలీవుడ్‌లో లాక్‌డౌన్ వేళ యువ హీరోలు, పెళ్లికాని ముదురు హీరోలు వ‌రుస‌పెట్టి పెళ్లి పీట‌లు ఎక్కేస్తున్నారు. నిఖిల్‌, నితిన్, రానా ఇప్ప‌టికే పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు ఈ లిస్టులోకి సందీప్ కిష‌న్ కూడా చేరిపోతున్నాడు. టాలీవుడ్ ఇన్న‌ర్ స‌ర్కిల్స్‌లో వినిపిస్తోన్న టాక్ ప్ర‌కారం ఒక‌టి రెండు రోజుల్లో సందీప్ కిష‌న్ పెళ్లి మ్యాట‌ర్ కూడా రివీల్ కానుంద‌ట‌. సందీప్ ఇండ‌స్ట్రీకి వ‌చ్చి ద‌శాబ్దం అవుతోంది. హీరోగా అడ‌పా ద‌డ‌పా హిట్లు కొడుతున్నాడు.. ప‌డుతూ లేస్తున్నాడు. తెలుగుతో పాటు త‌మిళ్ సినిమాలు కూడా చేస్తున్నాడు.

 

ఈ క్ర‌మంలోనే సందీప్ కిష‌న్ ఓ హీరోయిన్‌తో ప్రేమ‌లో ఉన్నాడ‌న్న వార్త‌లు వ‌చ్చాయి. అవి ప‌క్క‌న పెడితే సందీప్ తాజాగా త‌న సోష‌ల్ మీడియాలో 2020 త‌న జీవితానికి సంబంధించి ఎన్నో విష‌యాలు పంచుకునేలా చేసింద‌న్న పోస్ట్ పెట్టాడు. లైఫ్‌లో మ‌రో స్టిప్ వేసేందుకు ఈ సంవ‌త్స‌రం ధైర్యం ఇచ్చింద‌న్న సందీప్ సోమ‌వార‌మే ఆ న్యూస్ ఏంటో చెపుతాన‌న్నాడు. సందీప్ చెప్పిన మాట‌ల‌ను బ‌ట్టి చూస్తే త‌న పెళ్లి లేదా ప్రేమ విష‌యం బ‌య‌ట పెడ‌తాడ‌ని అంద‌రూ అంటున్నారు. మ‌రి సందీప్ సీక్రెట్ ప్రేమ‌లో అమ్మాయి ఎవ‌రో అన్న‌ది టాలీవుడ్ మొత్తం ఆస‌క్తిగా చూస్తోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news