Gossipsసాహూ రిలీజ్ పై టెన్షన్..షాక్ లో ఫ్యాన్స్..?

సాహూ రిలీజ్ పై టెన్షన్..షాక్ లో ఫ్యాన్స్..?

బాహుబలి 2 సినిమా తర్వాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ని వెండి తెరపై చూసి చాలా గ్యాప్ వచ్చింది. ఇప్పటికే బాహుబలి కోసం ఐదు సంవత్సరాలు తీసుకున్నప్రభాస్ ఆ గ్యాప్ లో ఒక్క సినిమాలో కూడా నటించలేదు. ఈ నేపథ్యంలో తన తదుపరి సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అందరి అంచనాలకు తగ్గట్టుగానే భారీ యాక్షన్ ఎపిసోడ్స్ తో ‘సాహూ’ సినిమా తెరకెక్కిస్తున్నారు యంగ్ డైరెక్టర్ సుజిత్.

ప్రభాస్ మార్కెట్ దృష్ట్యా ఈ సినిమా తెలుగు, తమిళ, మలయాళ, హిందీ బాషలలో ఒకేసారి రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు.బాలీవుడ్ భామ శ్రద్ధా కపూర్ కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాను, ఆగస్టు 15వ తేదీన విడుదల చేయనున్నారని ప్రకటించారు. ఇంతలోనే ఈ సినిమాకి సంగీత దర్శకులుగా పనిచేస్తోన్న శంకర్ ఎహసాన్ లాయ్, రీసెంట్ గా ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నట్లు వార్తలు వచ్చాయి. దాంతో సినిమా రిలీజ్ పై అభిమానులకు సందేహాలు మొదలయ్యాయి.

తాజాగా ఈ విషయంపై స్పందించిన డైరెక్టర్ సుజీత్ రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇచ్చారు. ముందుగా చెప్పినట్టుగానే ఆగస్టు 15వ తేదీన ఈ సినిమాను విడుదల అవుతుందని ఇందులో ఎలాంటి అనుమానాలు లేవని, విడుదల విషయంలో వస్తోన్న ఎలాంటి పుకార్లను నమ్మవద్దని, మ్యూజిక్ కూడా సిద్దమయు అనుకున్న సమయానికే ఈ సినిమా రిలీజ్ అవుతుందని ఆయన పేర్కొన్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news