Gossipsచైతుతో రొమాన్స్ వెరీ లైక్ అంటోన్న క్రేజీ హీరోయిన్‌

చైతుతో రొమాన్స్ వెరీ లైక్ అంటోన్న క్రేజీ హీరోయిన్‌

ఏ ముహూర్తాన కీర్తి సురేష్ మహానటి సినిమా ఒప్పుకుందో గాని… ఆ సినిమా సాధించిన అప్రతిహత విజయంతో ఆమెకు సౌత్ సినిమా ఇండస్ట్రీలో ఎక్కడ లేని క్రేజ్ వచ్చేసింది. ఇప్పుడు కీర్తి సురేష్ ని ఎక్కడ చూసినా మహానటి అని పిలుస్తున్నారు. తనకు తానే ఊహించని పాపులారిటీ సొంతం చేసుకోవడంతో… ఆ తర్వాత కీర్తి సినిమాల ఎంపికలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలోనే కొంత గ్యాప్ వచ్చినా ఇటు దక్షిణాది భాషలతో పాటు…. అటు బాలీవుడ్ లోనూ క్రేజీ సినిమాలను ఒప్పుకుంటూ ముందుకు వెళుతుంది.

ఇటీవలే బాలీవుడ్ సీనియర్ హీరో అజయ్ దేవగన్‌తో ఆడిపాడేందుకు ఓ సినిమాకు సైన్ చేసిన కీర్తి ఇటు తెలుగులో కింగ్ నాగార్జున, ఆయన తనయుడు నాగచైతన్య హీరోలుగా సోగ్గాడే చిన్ని నాయన ఫేం కురసాల కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కే బంగార్రాజు సినిమాకు ఓకే చెప్పిన‌ట్టు టాక్‌. ఈ సినిమాలో ఆమె చైతు సరసన న‌టిస్తోంద‌ని తెలుస్తోంది.

ప్ర‌స్తుతం నాగార్జున మన్మధుడు 2 సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయిన వెంటనే బంగార్రాజు సెట్స్ మీదకు వెళ్లనుంది అట. ఈ సినిమా స్టొరీ లైన్ ను కళ్యాణ్ కృష్ణ కీర్తి సురేష్ కు చెప్పటం… కం ఆమె చైతుతో నటించేందుకు వెంటనే ఓకే చెప్పటం చకచకా జరిగిపోయాయ‌ట‌. చైతుతో న‌టించేందుకు తాను ఎప్ప‌టి నుంచో రెడీగా ఉన్నాన‌ని… ఇప్పుడు అత‌డితో ఆన్ స్క్రీన్ రొమాన్స్‌కు రెడీగా ఉన్నాన‌ని ఆమె ఫుల్ ఖుషీలో ఉంద‌ట‌. మ‌రి ఈ జంట ఆన్‌స్క్రీన్‌పై ఎంత వీనుల విందుగా ఉంటుందో ? చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news