Gossipsమహర్షి మీద కన్నేసిన తమిళ స్టార్.. ఎవరంటే..?

మహర్షి మీద కన్నేసిన తమిళ స్టార్.. ఎవరంటే..?

సూపర్ స్టార్ మహేష్ సినిమాలను రీమేక్ చేస్తూ తమిళంలో స్టార్ గా ఎదిగాడు ఇళయదళపతి విజయ్. అఫ్కోర్స్ అక్కడ అతను స్టార్ హీరో అయితే ఆ స్టార్ డం ను మరింత పెంచేందుకు మహేష్ రీమేక్ సినిమాలు బాగా ఉపయోగపడ్డాయి. మహేష్ సూపర్ హిట్ సినిమాలైన ఒక్కడు, పోకిరి సినిమాలను తమిళంలో రీమేక్ చేసి విజయ్ సెన్సేషనల్ హిట్ అందుకున్నాడు. అయితే ఈమధ్య మహేష్ సినిమాలపై పెద్దగా దృష్టి పెట్టని విజయ్ మహర్షి సినిమాపై కన్నేసినట్టు తెలుస్తుంది.

తన పి.ఆర్ టీంతో మహర్షి స్టోరీ.. ప్రమోషన్స్ ఎలా ఉన్నాయో కనిపెట్టమని చెప్పాడట. అంతేకాదు ఈమధ్యనే రిలీజైన ట్రైలర్ కూడా చూసినట్టు కోలీవుడ్ టాక్. ప్రస్తుతం విజయ్ అట్లీ డైరక్షన్ లో సినిమా చేస్తున్నాడు. ఒకవేళ మహర్షి ఇక్కడ హిట్టైతే తమిళంలో విజయ్ హీరోగా చేయాలని చూస్తున్నాడట. మహర్షి ట్రైలర్ చూశాక సూపర్ స్టార్ ఫ్యాన్స్ పక్కా హిట్ అని ఫిక్స్ అయ్యారు.

వంశీ పైడిపల్లి డైరక్షన్ లో తెరకెక్కిన మహర్షి సినిమాలో మహేష్ సరసన పూజా హెగ్దె హీరోయిన్ గా నటించింది. సినిమాలో అల్లరి నరేష్ కూడా ఓ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశాడు. డిఎస్పి మ్యూజిక్ స్పెషల్ ఎట్రాక్షన్ కాగా దిల్ రాజు, అశ్వనీత్, పివిపి ముగ్గురు బడా నిర్మాతలు ఈ సినిమాను నిర్మించారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news