Gossipsనానా చీకటి కోణం బయటపెట్టిన సీనియర్ హీరోయిన్..!

నానా చీకటి కోణం బయటపెట్టిన సీనియర్ హీరోయిన్..!

టాలీవుడ్ లో శ్రీ రెడ్డి అనే మోడల్ క్యాస్టింగ్ కౌచ్ మీద చేసిన రచ్చ దేశవ్యాప్తంగా వార్తల్లోకి ఎక్కి ఇప్పుడిప్పుడే సర్దుమణుగుతుంది అనుకుంటున్న సమయంలో మళ్ళీ బాలీవుడ్ లో ఆ రచ్చ మొదలయ్యింది. విలక్షణ పాత్రధారణలతో భారతీయ సినీ పరిశ్రమలో తనదైన ముద్ర వేసిన నానా పాటేకర్ తన ప్రతిభకు భారత ప్రభుత్వం చే పద్మశ్రీ పురస్కారం కూడా దక్కించుకున్నాడు. ఎన్నో సామజిక అంశాలపై తనదైన స్టయిల్లో ఆయన పోరాడుతూ మంచి గుర్తింపు పొందాడు. కానీ ఇప్పుడు ఆయన అలాంటి వివాదాల్లో చిక్కుకున్నాడు.

సినిమా షూటింగ్‌ల సందర్భంగా మహిళలతో నానా పటేకర్ దారుణంగా వ్యవహరిస్తాడని హీరోయిన్ తనూశ్రీ దత్తా చేసిన ఆరోపణలు సంచలనం సృష్టించాయి. తనుశ్రీకి స్టార్ హీరోయిన్లు ప్రియాంక చోప్రా, కంగనా రనౌత్, సోనమ్ కపూర్, శిల్పాశెట్టి మద్దతుగా నిలిచారు. మరికొందరు ఆయనకు మద్దతు పలుకుతున్నారు. ఈ వివాదం ఇలాగే కొనసాగుతుండగా… అనూహ్యంగా ఈ వివాదంలోకి మాజీ హీరోయిన్ ఎంట్రయ్యింది.

కాకపోతే సదరు హీరోయిన్ ఎనిమిదేళ్ల క్రితం మాట్లాడిన ఒక వీడియో క్లిప్ ని నానా పటేకర్ వ్యతిరేక వర్గం వెలుగులోకి తెచ్చింది. అందులో నానా గురించి డింపుల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. నానా గొప్ప నటుడని.. యాక్టింగ్ టాలెంట్ విషయంలో ఆయనకు తిరుగులేదని.. ఆ టాలెంట్ చూస్తే మాత్రం ఆయన తప్పులన్నీ మాఫీ అయిపోతాయని ఆమె పేర్కొంది. నానా తనతో చాలా బాగా ఉండేవాడని అన్న డింపుల్ తాను ఆయనలోని చీకటి కోణం కూడా చూశానని వెల్లడించింది. అది చాలా భయంకరంగా ఉంటుందని ఆమె ఆ వీడియోలో మాట్లాడింది. ఇప్పుడు ఆ వీడియో బాగా వైరల్ అవుతోంది. వాస్తవంగా ఈ వీడియో క్లిప్ తను శ్రీ దత్తకు మద్దతుగా సరైన సమయంలో దొరికిందంటూ ఆమె అనుకూల వర్గం ఆనందపడుతోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news