‘ ఉన్నది ఒకటే జిందగీ ‘ ఎంతవరకు సక్సస్ సాధించింది ? నాలుగు రోజులకి ఎంత వసూల్ చేసింది ?

రామ్ నటించిన తాజా చిత్రం ‘ఉన్నది ఒకటే జిందగీ’ తెలుగు రాష్ట్రాల్లో మంచి టాక్‌తో దూసుకుపోతుంది.గతంలో రామ్ – తిరుమల కాంబినేషన్‌లో వచ్చిన నేను…శైలజ మంచి హిట్ అవ్వడంతో సహజంగానే ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. రామ్ సరసన అనుపమ పరమేశ్వరన్ – లావణ్య త్రిపాఠి జంటగా నటించిన ఈ సినిమాలో దర్శకుడు కొత్తగా చూపించిన స్నేహం + ప్రేమ కాన్సెప్ట్ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యింది.
తొలి రోజు వరల్డ్‌వైడ్‌గా రూ 3.63 కోట్ల షేర్ రాబట్టిన ఈ సినిమా రామ్ కెరీర్‌లోనే ఫస్ట్ డే హయ్యస్ట్ ఓపెనింగ్స్ సాధించిన సినిమాగా నిలిచింది. ఈ సినిమా నాలుగు రోజులకు 12.93 కోట్ల షేర్ కొల్లగొట్టింది. ఏరియాల వారీగా ఈ సినిమా వసూళ్లు ఇలా ఉన్నాయి.ఈ వసూళ్లు రామ్ కెరీర్‌లోనే ఫస్ట్ వీకెండ్‌లో హయ్యస్ట్ వసూళ్లుగా నిలిచాయి.
ఉన్నది ఒక్కటే జిందగీ నాలుగు రోజులకు ఏరియా వైజ్ షేర్ (రూ.కోట్లలో)
నైజాం – 4 .19
సీడెడ్ -1 .71
ఉత్తరాంధ్ర -1 .44
గుంటూరు – 1.15
కృష్ణా – 0 .97
ఈస్ట్ – 0 .84
వెస్ట్ – 0 .68
నెల్లూరు – 0 .35
————————————
ఏపీ+తెలంగాణ = 10.53 కోట్లు
———————————–
ఓవర్సీస్ – 1.35
రెస్ట్ అఫ్ ఇండియా – 1.05
———————————————–
టోటల్ వరల్డ్ వైడ్ షేర్ : 12 .93 కోట్లు

Leave a comment