Moviesబిగ్ బాస్ లోకి మహేష్.. అదో పెద్ద స్కెచ్..!

బిగ్ బాస్ లోకి మహేష్.. అదో పెద్ద స్కెచ్..!

బాలీవుడ్ బిగ్ బాస్ ఎంత సక్సెస్ అయ్యిందో ఇప్పుడు సౌత్ రీజనల్ లాగ్వెజెస్ లో ఆ షోని అదే రేంజ్ లో హిట్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. తెలుగులో తారక్, తమిళంలో కమల్ వారి వారి సొంత ప్రతిభతో బిగ్ బాస్ కు ప్రత్యేకమైన క్రేజ్ వచ్చేలా చేసుకున్నారు. ముఖ్యంగా తెలుగులో యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ హోస్ట్ గా ఇరగదీస్తున్నారు అన్నది వాస్తవం.

ఇక ఈ షోని సినిమాల పబ్లిసిటీ కోసం వాడేందుకు సెలబ్రిటీని సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ అవబోతున్న సినిమాల సెలబ్రిటీస్ బిగ్ బాస్ హౌజ్ మెట్స్ తో కాసేపు అలా గడిపి షో ని.. దాని ద్వారా తమ సినిమాను ప్రమోట్ చేసుకుంటున్నారు. ఇక లేటెస్ట్ సెన్సేషన్ ఏంటంటే బిగ్ బాస్ కు మహేష్ వస్తున్నాడన్న వార్తే.

స్పైడర్ ప్రమోషన్స్ లో భాగంగా బిగ్ బాస్ కు మహేష్ రావడం కన్ఫాం అని తేలింది. అయితే అది తెలుగులోనా తమిళంలోనా అన్నది తేలలేదు. స్పైడర్ తో తమిళ మార్కెట్ పై కన్నేసిన మహేష్ అక్కడ మార్కెట్ ను శాసించడానికి విశ్వప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ క్రమంలో కోలీవుడ్ ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యే విధంగా ప్రమోషన్స్ ప్లాన్ చేస్తున్నారట. అందుకే బిగ్ బాస్ ను ఎంచుకున్నట్టు తెలుస్తుంది.

మొదట తమిళ బిగ్ బాస్ లోనే మహేష్ కనిపిస్తాడని టాక్. తమిళ ప్రేక్షకులను బుల్లితెర ద్వారా కలిసే ఈ సదవకాశాన్ని మహేష్ వినియోగించుకోవాలని చూస్తున్నాడు. ఇక అక్కడ బిగ్ బాస్ కు వెళ్లాక ఇక్కడ రాకుండా ఉంటాడా.. ఎన్.టి.ఆర్ బిగ్ బాస్ కు మహేష్ వచ్చే అవకాశాలు ఉన్నాయట. సినిమా ప్రమోషన్ తో పాటుగా బిగ్ బాస్ ఆడియెన్స్ కు తమ సినిమా విశేషాలను పంచుకునే ఆలోచనలో ఉన్నాడు మహేష్. దీని గురించి మిగతా విషయాలు త్వరలో వెళ్లడవుతాయని తెలుస్తుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news