Moviesచిచ్చు రేపిన ఆర్జివి.. పవన్ కన్నా విజయ్ గ్రేట్..!

చిచ్చు రేపిన ఆర్జివి.. పవన్ కన్నా విజయ్ గ్రేట్..!

సంచలన దర్శకుడు రాం గోపాల్ వర్మ మరో సంచలన స్టేట్మెంట్ తో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. అర్జున్ రెడ్డి సినిమా చూసిన వర్మ సినిమాలో విజయ్ యాక్టింగ్ కు ఫిదా అవ్వడమే కాదు విజయ్ స్టైల్.. లుక్ పరంగా పవన్ కంటే 10 రెట్లు బెటరని అన్నాడు. ఇక నటనలో పవర్ స్టార్ కంటే 20 రెట్లు బెటర్ అని కామెంట్ చేశాడు.

అసలకే పవన్ పై కత్తి మహేష్ చేస్తున్న చిత్ర విచిత్రమైన కామెంట్స్ తో ఫ్యాన్స్ గరంగరంగా ఉంటే ఇప్పుడు అది చాలదు అన్నట్టు విజయ్ ఏకంగా పవన్ కంటే బెటర్ అని అనడం ఆశ్చర్యంగా మారింది. పవన్ ఫ్యాన్స్ కత్తి మహేష్ కు చుక్కలు చూపిస్తుంటే ఆయనేమో టివి స్టూడియోల చుట్టూ తిరుగుతున్నాడు.

ఇక ట్విట్టర్ కు వర్మ గుడ్ బై చెప్పింది.. వివాదాలకు దూరం అవడానికే అనుకున్నారు కాని పవన్ ను వ్యక్తిగతంగా అభిమానించే అతనే కత్తి మహేష్ మాటలకు బలం చేకూరుస్తూ పవన్ కంటే విజయ్ దేవరకొండ యాక్టింగ్ లో గొప్ప అంటూ కామెంట్ చేయడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. తన సినిమాలను గాలికొదిలేసిన వర్మ ఇలాంటి కామెంట్స్ తో స్టార్ ఫ్యాన్స్ టార్గెట్ చేయడం ఏంటని కొందరు రివర్స్ కౌంటర్ ఇస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news