Moviesబాలయ్యకు పోటీగా ఫ్యాక్షన్ లీడర్ అయిన నయనతార..!

బాలయ్యకు పోటీగా ఫ్యాక్షన్ లీడర్ అయిన నయనతార..!

నందమూరి నట సింహం బాలకృష్ణ హీరోగా కె.ఎస్ రవికుమార్ డైరక్షన్ లో వస్తున్న సినిమా ప్రస్తుతం సెట్స్ మీద ఉంది. బాలయ్య మరోసారి మాస్ ఆడియెన్స్ ను మెప్పించేందుకు వస్తున్న ఈ సినిమాలో నయనతార హీరోయిన్ గా నటిస్తుంది. షూటింగ్ సమయంలో నయనతార లుక్స్ లీక్ అయితే నయనతార ఇందులో హోమ్లీ రోల్ చేస్తుందని అనుకున్నారు.

కాని ఈ సినిమాలో నయనతార ఓ ఫ్యాక్షన్ లీడర్ గా కనిపించబోతుందట. బాలయ్యతో కలిసి ఈ సినిమాలో తను కూడా ఫైట్స్ గట్రా చేస్తుందని టాక్. సో మొత్తానికి నయన్ తెలుగులో మరోసారి తన టాలెంట్ చూపించబోతుంది. ఈ సినిమాకు నయనతార 3 కోట్ల దాకా రెమ్యునరేషన్ తీసుకుంటుందని టాక్. ఫ్యాక్షన్ కథలతో చరిత్ర సృష్టించిన బాలయ్య మరోసారి అలాంటి కథతో బాక్సాఫీస్ పై దండయాత్ర చేసేందుకు వస్తున్నాడు.

ఇప్పటికే సింహా, శ్రీరామరాజ్యం సినిమాలతో కలిసి పనిచేసిన బాలకృష్ణ, నయనతారల జంట ముచ్చటగా మూడోసారి కాంబినేషన్ రిపీట్ చేస్తున్నారు. మరి ఈ క్రేజీ జంట చేస్తున్న ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news